రంగారెడ్డి

మంచి వాతావరణం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 17: మొక్కలు నాటి వాటిని రక్షించి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని గచ్చిబౌలిలో కమిషనరేట్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీపీ అనసూయ, ఏడీసీపీలు మాణిక్‌రాజ్, గౌస్ మొహియుద్దీన్, కవిత, ఏసీపీలు లక్ష్మినారాయణ, సంక్రాంతి రవి కుమార్, కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
టీటీఐ ఏర్పాటుకు కృషి
* వెస్ట్ జోన్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర
వికారాబాద్, ఫిబ్రవరి 17: జిల్లాలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిస్ట్యూట్ ఏర్పాటుకు కృషి చేస్తామని వెస్ట్ జోన్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సోమవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హైదరాబాద్ రేంజ్ డీ ఐజీ శివశంకర్ రెడ్డి, జిల్లా ఎస్‌పీ ఎం.నారాయణ, అదనపు ఎస్‌పీ రశీద్, వికారాబాద్ డీఎస్‌పీ సంజీవరావు, డీటీసీ డీఎస్‌పీ విజయ్ కుమార్ ఉన్నారు.
మొక్కలు నాటిన మహేష్ భగవత్
ఉప్పల్, ఫిబ్రవరి 17: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం ఉద్యమంలా జరిగింది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం పట్టణ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి పర్వతాపూర్‌లో చెత్త డంపింగ్ యార్డ్‌లో మొక్కలు నాటారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ స్థలంలో కమిషనర్ మహేష్ భగవత్ పోలీసు అధికారులైన రక్షిత కృష్ణమూర్తి, నర్సింహా రెడ్డి, అంజిరెడ్డి, వెంకటేశ్వర్లు, మక్భుల్ జానీ, రవి కుమార్, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకురాలు శేరి సవితా కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో మొక్కలు నాటి మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు.