రంగారెడ్డి

ఒక్క ఓటుతో నెగ్గిన సర్వర్‌పాషా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జనవరి 25: మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటుతో స్వతంత్ర అభ్యర్థి సర్వర్‌పాషా విజయం సాధించారు. 17వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ సలీమొద్దిన్‌పై స్వతంత్ర అభ్యర్థి సర్వర్‌పాషా ఒక్క ఓటుతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సలీమొద్ధిన్‌కు 526ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి 527ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో స్వతంత్ర అభ్యర్థి సర్వర్‌పాషాను విజయం వరించింది. మొత్తం 1158ఓట్లు పోల్ కాగా టీఆర్‌ఎస్‌కు 526, కాంగ్రెస్‌కు 71, టీడీపీకి 7ఓట్లు, బీఎస్పీకి 10ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సర్వర్‌పాషాకు 527ఓట్లు వచ్చాయి. మున్సిపల్ చరిత్రలోనే ఒక్కఓటుతో విజయం సాధించిన వ్యక్తి సర్వర్‌పాషా. 17వ వార్డులో పర్యటించి ఓటర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

షాద్‌నగర్‌లో
భార్య భర్తల విజయం
షాద్‌నగర్, జనవరి 25: పుర పోరులో భార్యభర్తలు విజయం సాధించారు. షాద్‌నగర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల సమరంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా 20వ వార్డు నుంచి కొందూటి మహేశ్వరి, 28వ వార్డు నుండి కొందూటి నరేందర్ కాంగ్రెస్ అభ్యర్థులతో పోటీ పడ్డారు. వీరిద్దరు సమీప కాంగ్రెస్ అభ్యర్థులపై మంచి మెజార్టీతో గెలుపొందారు. వీరిద్దరిని పలువురు అభినందించారు.
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు
బాలాపూర్, జనవరి 25: మీర్‌పేట్ కార్పొరేషన్‌లో బీజేపీ అభ్యర్థులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు పోటీ చేసి, విజయం సాధించారు. 25వ వార్డు నుంచి కీసర గోవర్ధన్ పోటీ చేయగా సోదరుడు కీసర హరినాథ్ రెడ్డి 8వ వార్డు నుంచి పోటి చేశారు. మరో సొదరుడి భార్య కీసర జమున 23వ వార్డు నుంచి పోటి చేసి గెలుపొందారు.