రంగారెడ్డి

పీర్జాదిగూడలో కారు..పదహారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 25: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. శనివారం పర్వతాపూర్‌లోని అరోర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 26 డివిజన్లలో రెండు రౌండ్‌లకే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్ 16 సీట్లకే మరిమితం కాగా కాంగ్రెస్-3, బీజేపీ-1, స్వతంత్రలు-6గురు గెలుపొందారు. ఒకటో డివిజన్ మేయర్ అభ్యర్థి జక్క వెంకట్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2వ డివిజన్‌లో కేతావత్ సుభాష్ నాయక్ టీఆర్‌ఎస్, 3వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి బైటింటి శారద ఈశ్వర్ రెడ్డి, 4వ డివిజన్‌లో యాసారం మహేశ్వరి టీఆర్‌ఎస్, 5వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి బొడిగె స్వాతి గౌడ్, 6వ డివిజన్‌లో కొల్తూరి మహేష్ కాంగ్రెస్, 7వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి మాడ్గుల చంద్రకళ, 8వ డివిజన్‌లో లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి టీఆర్‌ఎస్, 9వ డివిజన్‌లో బచ్చ రాజు టీఆర్‌ఎస్, 10వ డివిజన్‌లో వీరమల్ల సుమలత టీఆర్‌ఎస్, 11వ డివిజన్‌లో మద్ది యుగంధర్ రెడ్డి టీఆర్‌ఎస్, 12వ డివిజన్‌లో అమర్‌సింగ్ టీఆర్‌ఎస్, 13వ డివిజన్‌లో తూంకుంట్ల ప్రసన్నలక్ష్మి శ్రీధర్ రెడ్డి బీజేపీ, 14వ డివిజన్‌లో పాశం శశిరేఖ బుచ్చియాదవ్ టీఆర్‌ఎస్, 15వ డివిజన్‌లో బండారి మంజుల కాంగ్రెస్, 16వ డివిజన్‌లో బండి రమ్య టీఆర్‌ఎస్, 17వ డివిజన్‌లో కుర్ర శివ కుమార్ గౌడ్ టీఆర్‌ఎస్, 18వ డివిజన్‌లో కుర్ర శాలిని టీఆర్‌ఎస్, 19వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి అల్వాల సరిత, 20వ డివిజన్‌లో కౌడే పోచయ్య కాంగ్రెస్, 21వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి పిట్టల మల్లేష్, 22వ డివిజన్‌లో భీంరెడ్డి నవీన్ రెడ్డి టీఆర్‌ఎస్, 23వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి నారేళ్లపల్లు మధుసూదన్ రెడ్డి, 24వ డివిజన్‌లో ఎంపల్ల అనంత్ రెడ్డి టీఆర్‌ఎస్, 25వ డివిజన్‌లో దొంతిరి హరిశంకర్ రెడ్డి టీఆర్‌ఎస్, 26వ డివిజన్‌లో పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. చివరి వరకు ఆమె ఎవరో తెలియదు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సహకారంతో టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్ దక్కించుకున్న లేతాకుల మాధవి 8వ డివిజన్‌లో కార్పొరేటర్‌గా గెలిచి అందరిని ఆశ్ఛర్యానికి గురిచేసింది.
స్వతంత్ర అభ్యర్థులదే హవా
పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ఊహించినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్ వచ్చినా టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి ఇష్టమైన 20వ డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ తెచ్చుకుని బరిలో నిలిచిన కౌడే పోచయ్య ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాడ్గుల చంద్రకళ చంద్రారెడ్డి, బైటింటి శారద ఈశ్వర్ రెడ్డి, బొడిగె స్వాతి కృష్ణ గౌడ్, నారెళ్లపల్లి మధుసూదన్ రెడ్డి, పిట్టల మల్లేష్ రెబల్‌గా నిలిచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడి ఘన విజయం సాధించారు. ఏ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించక స్వతంత్ర అభ్యర్థి అల్వాల సరిత స్వచ్చందంగా ప్రజాధరణతో 19వ డివిజన్ నుంచి విజయం సాధించారు. టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ తూంకుంట్ల ప్రసన్నలక్ష్మి శ్రీ్ధర్ రెడ్డి బీజేపీలో చేరి టిక్కెట్ తెచ్చుకుని 13వ డివిజన్‌లో గెలుపొంది పార్టీకి పేరు తెచ్చారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి వంగేటి ప్రభాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌తో హోరాహోరీగా పోటీ పడ్డ కాంగ్రెస్ అభ్యర్థులు తల్లీ కొడుకులు రవి, రామేశ్వమ్మ ఓటమిపాలయ్యారు. సీపీఎం నాయకురాలు ఎన్.సృజన స్వతంత్ర అభ్యర్థిగా 26వ డివిజన్‌లో పోటీ పడి టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేశ్వరి చేతిలో ఓటమిపాలయ్యారు.
ప్రజా విజయం: జక్క
పీర్జాదిగూడ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ఇది ప్రజా విజయంగా భావిస్తున్నామని ఒకటో డివిజన్‌లో ఘన విజయం సాధించిన మేయర్ అభ్యర్థి జక్క వెంకట్ రెడ్డి అన్నారు. కారు..కేసీఆర్..పదహారు సీట్లతో మున్సిపల్ కార్పొరేషన్‌పై గులాబీ జెండాను ఎగరువేస్తున్నామని పేర్కొన్నారు.

బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో హంగ్
బాలాపూర్, జనవరి 25: బడంగ్‌పేట్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో ఫలితాలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల కౌటింగ్ సాయంత్రం 5 గంటల వరకు పూర్తి అయింది. బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో మెత్తం 32 వార్డులలో ఎన్నికలు నిర్వహించగా.. టీఆర్‌ఎస్ 13, బీజేపీ 10, కాంగ్రెస్‌కు 7 సాధించగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 30వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భీమిడి స్వప్న జంగా రెడ్డి 14 వందల 9 ఓట్లతో అత్యధిక మెజారిటీ సాధించారు. ఒకటవ వార్డు నుంచి పెద్ద బావి శ్రీనువాస్ రెడ్డి(టీఆర్‌ఎస్), రెండు పద్మా (బీజేపీ), మూడు రామిడి మధురి వీరాకర్ణ రెడ్డి (బీజేపీ), నాలుగు సం రెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి (టీఆర్‌ఎస్), ఐదు బోయపల్లి దీపిక శేఖర్ ర