రంగారెడ్డి

ఓటుహక్కుపై విస్కృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జనవరి 23: ఓటుహక్కుపై కళాశాలల్లో, పాఠశాలల్లో విస్కృత ప్రచారం నిర్వహించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం 2020 జాబితాపై గురువారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రెడ్డి మాట్లాడుతూ 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెఘా ఈవెంట్స్ నిర్వహించాలని తెలిపారు. వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 25న ప్రశంశా పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎస్‌ఎస్‌ఆర్ 2020లో భాగంగా డిసెంబర్ 16న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేశామని, 27వ తేది వరకు అభ్యంతరాలు స్వీకరించి ఉన్నందున పోలింగ్ స్టేషన్ల వారీగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలని అన్నారు. ఫిబ్రవరి 7న ఓటర్ల జాబితా చివరి పబ్లికేషన్ ఉన్నందున సరిచూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ విద్యాసాగర్, డీఆర్వో మధుకర్ రెడ్డి, ఏవో వెంకటేశ్వర రావు, కీసర ఆర్డీవో రవి పాల్గొన్నారు.