రంగారెడ్డి

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని పరిష్కారం చేస్తుందని.. మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు మాత్రం రైతులకు మరింత సేవలు అందించి, మంచి పేరు తెచ్చుకోవాలని మార్కెటింగ్ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్బీనగర్‌లోని కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కార్యర్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి టీఎన్‌జీఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం యూనియన్ 2020 నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతు చెమట చుక్కలు, మాసీన బట్టలే మనకు అన్నం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతే కేంద్ర బిందువు అన్నారు. ఒక రైతు ఏ ప్రభుత్వ కార్యాలయంకు వచ్చిన అతని సాదరంగా అహ్వనించి, అతని సమస్యను నవ్వుతు పరిష్కరిష్కారింలని సూచించారు. మార్కెటింగ్ ఉద్యోగుల సమస్యలతో పాటు ఫించనర్ల సమస్యలను అంచేల వారీగా పరిష్కారం చేస్తామని హమీ ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ చిత్రమే వ్యవసాయమని, రైతును సగర్వంగా చూడలన్నదే ప్రభుత్వ ముఖ్యద్దేశమని అన్నారు. రైతుకు సంబంధించిన అన్ని విభగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రైతు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి పరిష్కారం చేస్తున్నట్లు గుర్తు చేశారు. సిద్దిపేట్ తరహాలో రాష్ట్ర మంతట ఇంటిగ్రెట్ మార్కెట్లు చేసే అవకాశం ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో దళారుల జ్యోక్యాన్ని ఉద్యోగులు నిర్మూలించాలని సూచించారు. కేంద్రం పలు పంటలకు మద్దతు ధర ప్రకటించిన, దిగుబడిలో 30 శాతంకు మించి కొనడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దింతో రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు వెయ్యి కోట్ల భారం పడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బేవరేజెస్ సంస్థ చైర్మన్ దేవి ప్రసాద్ రావు, టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీ బాయి, టీఎన్‌జీఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు చిలక నర్సింహా రెడ్డి, కార్యదర్శి ముకరం, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరమళ్ల రాంనర్సింహ గౌడ్, సహ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు.