రంగారెడ్డి

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, జనవరి 22: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం ఓటర్లు 19460కు 16 047 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీ పరిధీలో 15 వార్డులో మొత్తం పోలింగ్ శాతం 82.46 జరిగింది. ఓటర్లు ఉదయం 7 గంటల వరకే పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరడం కనిపించింది వృద్ధులు, దివ్యాంగులు సైతం ఈసారి చాల మంది ఓట్లను వినియోగించుకున్నారు. పహాడీషరీప్, ఆదిభట్ల సీఐ శంకర్‌గౌడ్, నరేందర్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రజాప్రతినిధులు ఊపిరిపీల్చుకున్నారు.
తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని బాలురు ఉన్నత పాఠశాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ హరీష్ సందర్శించారు. వారి వెంట కందుకూర్ ఆర్టీవో సీహెచ్.రవీందర్ రెడ్డి ఉన్నారు. మున్సిపాలిటీ కమిషనర్ జ్ఞానేశ్వర్‌ను ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ మంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్, సతీమణి వినోద, కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్, కుటుంబ సభ్యులు తుక్కుగూడ మున్సిపాలిటీ 15వ వార్డులోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నార్సింగి: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్, నార్సింగి, మణికొండ మున్సిపల్‌లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు. వృద్ధులు, యువకులు, యువతులు, మహిళలు, పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 56.06 శాతం, నార్సింగిలో 75.61 శాతం, మణికొండ మున్సిపల్ పరిధిలో 41.02 శాతం జరిగినట్లు అధికారులు తెలిపారు.
బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్, మణికొండ, నార్సింగి మున్సిపల్ పరిధిలో ఎన్నికలు ముగిశాయి. దీంతో అధికారులు బ్యాలెట్ బాక్సులను సీజ్‌చేసి లార్డ్స్ కళాశాలకు తరలించారు. అధికారుల పర్యవేక్షణ మధ్య వీటిని తరలించారు. 24న లెక్కింపునకు వీటిని తీసి లెక్కిస్తారు.
తాండూరు: మున్సిపల్ ఎన్నికల పర్వంలో ప్రధాన ఘట్టం పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు, మొత్తం 108 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన పార్టీల అభ్యర్థులు, కార్యకర్తల మధ్య వాగ్విదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని వార్డు నెంబర్ 35 స్థానక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో ఏర్పాటు చేసిన 103, 104, 105 పోలింగ్ కేంద్రాల వద్ద ఎంఐఎం, టీఆర్‌ఎస్, సీపీఐలకు చెందిన అభ్యర్థులు తమ అనుకూల ఓటర్లను ఎదుటి పక్షం అభ్యర్థుల ఎజెంట్లు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని పరస్పరం వాదించుకుంటూ దాడులు, తోపులాటలతో కొంత సేపు వార్డు నెంబర్ 35, పోలింగ్ బూత్‌ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి ఎంఐఎం సీపీఐల మధ్య ఓటర్లను అడ్డగించిన సందర్భంలో ఇరు గ్రూపులకు చెందిన కార్యకర్తలు ఓటర్లు ఘర్షణలకు దిగారు. దాంతో స్థానిక పోలీస్ అధికారులు, డీ ఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ. రవికుమార్, ఎస్‌ఐ ఏడు కొండలు ప్రత్యేక బలగాలతో వార్డు నెంబర్ 35 పోలింగ్ బూత్ వద్దకు తరలి వచ్చి స్వల్పంగా లాఠీలు ఝూళీపించి ఘర్షణలకు కారణం అవుతున్న ఎంఐఎం, సీపీఐ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమికొట్టారు. పోలింగ్ సమయం ముగిసే వరకు డీఎస్పీ లక్ష్మీనారాయణ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలోని వార్డు నెంబర్ 24, పోలింగ్ బూత్ వద్ద సైతం మధ్యాహ్నాం 3గంటల సమయంలో టీఆర్‌ఎస్, బీజేపీల కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి.
తాండూరు: మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు పట్టణ ప్రజలు అధికార టీఆర్‌ఎస్‌ను మరోసారి ఆదరించి ఓట్లు వేశారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న డీగ్రి కళాశాల భవనంలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చైర్ పర్సన్ పీఠం అధిష్టించటం ఇక లాంఛనీయమే అని మహేందర్ రెడ్డి పునరుద్గాటిస్తూ పట్టణ ఓటర్లందరికి తమ కృతజ్ణతలు తెలిపారు.
తాండూరు: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ముఖ్యంగా యువత బీజేపీని ఆదరించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పటేల్ రవిశంకర్ పేర్కొన్నారు. స్థానిక విజయ విద్యాలయ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద మిడియాతో మాట్లాడుతూ గడచిన 2014 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓకే ఓక్క కౌన్సిలర్ స్థానం దక్కిందని గుర్తు చేశారు. పార్టీ వర్గాల అభిప్రాయం మేరకు 14నుండి 16 స్థానాలు బీజేపీ పరం అవుతాయన్న వాదనలు వినిపిస్తున్నట్లు తెలిపారు.
తాండూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం కొద్దిపాటి చెదురు ముదురు సంఘటలతో మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియటం పట్ల స్థానిక, జిల్లా పోలీస్ యంత్రాంగం ఊపిరీ పీల్చుకుంది.
పోలింగ్ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ రశీద్, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ, రేరల్ సర్కిల్ సీఐ, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 250 మంది పోలీస్ అధికారులు, బలగాలను రప్పించినట్లు డీఎస్పీ బుధవారం సాయంత్రం వివరించారు. పోలింగ్ సందర్భంగా ముందస్తుగా పాత నేరస్తులు, రౌడీ షీటర్లను అరెస్ట్ చేసినట్లు, పోలింగ్ రోజు ఎవరిని అరెస్ట్ చేయలేదని డీఎస్పీ తెలిపారు.