రంగారెడ్డి

బీమాతో ధీమాగా ఉండొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, జనవరి 22; ప్రతి ఒక్కరు కచ్చితంగా బీమా పొంది ఉండాల్సిన అవసరం ఎంతేనా ఉందని గ్రామీణ బ్యాంకు రంగారెడ్డి రీజియన్ కార్యనిర్వాహణాధికారి లక్ష్మయ్య సూచించారు. కులకచర్ల మండలం ఇప్పపల్లెలో ఖాతాదారుడు రెండు మాసాల క్రితం ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబీకులకు రూ. 2లక్షల విలువ చేసే చెక్కును బుధవారం అందజేశారు.
ప్రధానమంత్రి అందరికి అందుబాటులో ఉండేవిధంగా బ్యాంకు ఖాతాదారులంతా ఏడాదికి రూ.12 చెల్లిస్తే రూ.2 లక్షల మేర బీమా సౌకర్యం ఉందని అన్నారు. దీనికి తోడు జీవనజ్యోతి లాంటి బీమా కూడా ఉందని పేర్కొన్నారు. అతి తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశాలు బ్యాంకులు కల్పిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో కులకచర్ల శాఖ కార్యనిర్వాహాణాధికారి సుధాకర్, క్యాషియర్ రమేశ్, ఇప్పపల్లె సర్పంచ్ అనురాధా, ఎంపీటీసీ మాలె పద్మమ్మ, కార్యదర్శి శ్రీనివాస్, విద్యాకమిటీ చైర్మన్ యాదయ్య గౌడ్, మాజీ సర్పంచ్ రాములు, వీరశైవ లింగాయత్ మండల ప్రచార కార్యదర్శి మందుల శంకర్ పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేయూత
వనస్థలిపురం, జనవరి 22: నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్ని విధాల సహకారాన్ని అందిస్తుందని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి చెప్పారు.డివిజన్ పరిధిలోని జడ్జెస్ కాలనీ సహారా రోడ్డులో నిరుద్యోగ యవకులు స్వయం ఉపాధి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన జ్యోతి వెన్‌కాబ్ చికెన్ సెంటర్‌ను విఠల్ రెడ్డి హజరై ప్రారంభించారు.
కుటుంబ పోషణ కోసం తమకు తోచిన రీతిలో స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవడం అభినంద నీయమని అన్నారు. ఇలాంటి వారికి ఎలాంటి సహకారం కావాలన్న పూర్తి స్థాయిలో అందించే విధంగా కృషి చేస్తానని హామి ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు జగదీష్ యాదవ్, జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకులు సర్వయ్య, లింగస్వామి, నర్సింహా, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు చీరుక నర్సిరెడ్డి, జేజే.రెడ్డి, మోహన్ రెడ్డి, నాయకులు బాల్‌రాజు పాల్గొన్నారు.
తాండూరులో 71.33 శాతం పోలింగ్
తాండూరు, జనవరి 22: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ క్రమంలో తాండూరులో 71.33 శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు బుధవారం సాయంత్రం వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను మొత్తం 64 వేల 188 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ సందర్భంగా మొత్తం 45 వేల 763 ఓట్లు పోలయినట్లు అధికారులు వెల్లడించారు. అందులో పురుషులు 22 వేల 811 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మహిళలు 22 వేల 972 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 72.01 శాతం, మహిళలు 70.66 శాతం ఉన్నారు. మున్సిపల్ పరిధిలో ఓటింగ్ శాతం 80 నుంచి 85 శాతం వరకు ఉంటుందని ఆయా రాజకీయ పార్టీల నేతలు వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. అధికార టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతింటున్నారు. ఓటింగ్ శాతం కేవలం 71.33 శాతానికే పరిమితం కావటంతో టీఆర్‌ఎస్ నాయకుల్లో గెలుపోటములపై గుబులు మొదలయ్యింది.