రంగారెడ్డి

ఎన్నికల పారదర్శకతపై పైలెట్ ప్రాజెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 20: కొంపల్లి మున్సిపాలిటీలో మోబైల్ టీ ఫోలియో యాప్ (ఫెస్ రికగ్నైజేషన్ అప్లికేషన్) ఫైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర ఎన్నికల అథారిటి అధికారి (ఐఏఎస్) శ్రీదేవి, రాష్ట్ర ఏసీసీ అధికారి విష్ణుతో కలిసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి యాప్‌ను ప్రవేశ పెట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఫైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ యాప్‌ను ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ మోబైల్ యాప్‌లో ముందుగా నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్‌ను ముందుగా ఎంపిక చేసి ఓటరు పోలింగ్ స్టేషన్ వచ్చినప్పుడు ఫోన్ ద్వారా యాప్‌ను ఓపెన్ చేసి వ్యక్తి ఫేస్‌ను స్కాన్ చేస్తే ఓటరులిస్ట్‌లో ఉన్న వ్యక్తి ఒక్కరేనా అని గుర్తించి ఓటరు క్రమ సంఖ్య, ఎపిక్ నెంబర్, డబుల్ ఓటును గుర్తించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశం పెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల అథారిటీ అధికారి టీకే శ్రీదేవి మాట్లాడుతూ మోబైల్ టీ ఫోలియో యాప్ (ఫేస్ రికగ్నైజేషన్ అప్లికేషన్) ద్వారా దొంగ ఓట్లను అరికట్టవచ్చని తెలిపారు. రాష్ట్ర ఎస్‌సీసీ అధికారి విష్ణు, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు.