రంగారెడ్డి

వైభవంగా చిత్తారమ్మ జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 19: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం శ్రీచిత్తారమ్మ దేవీ జాతర వేడుకలు ఆదివారం వైభవంగా జరిగింది. జాతరకు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, కార్పొరేటర్ రావుల శేషగిరిలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దసంఖ్యలో భక్కులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి బోనాలు, మేకపోతులను, కోడి పుంచులను బలిచ్చి మొక్కులను తీర్చుకున్నారు. వివేక్, కూన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖఃసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య పాల్గొన్నారు.