రంగారెడ్డి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్ శర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 18: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 22న ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలను జనరల్ అబ్జర్వర్ ఎల్. శర్మన్ శనివారం పరిశీలించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మున్సిపాల్టీల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కావాల్సిన వౌలిక వసతులను కల్పించాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్‌లను అప్రమత్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ర్యాంపులు, విల్‌చైర్లు సమకుర్చాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలను కలియ తిరుగుతూ సంబంధిత అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు ముకుంద రెడ్డి, సురేశ్, అమరేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జ్యోతి పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో అధికారుల పనితీరు భేష్
*కలెక్టర్ ఎంవీ రెడ్డి అభినందన
కీసర, జనవరి 18: పల్లె ప్రగతి మొదటి, రెండో విడతల్లో అధికారుల పనితీను భేషుగ్గా ఉందని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి అభినందించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తమ మండలం, ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి జనవరి 26 వతేదీన అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి నాల్గు నెలలకో సారి ఎంపిక చేసి అవార్డులు అందజేస్తామని అన్నారు. పనులు చేయని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో లేని పంచాయతీ కార్యదర్శులను బదిలీ లేదా, సరెండర్ చేస్తామని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు, గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చేయాలని విద్యుత్ అధికారులను కోరారు. హరితహారంలో నాటిన మొక్కలు 85 శాతం బతికించుకోవాలని వివరించారు. ఉపాధిహామీ నిధుల ద్వారా వైకుంఠధామాల్లో పనులు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో జేసీ విద్యాసాగర్, ఇన్‌చార్జి డీపీవో జ్యోతి పాల్గొన్నారు.