రంగారెడ్డి

పత్తి రైతుల మెరుపు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, నవంబర్ 18: పత్తి రైతులు సోమవారం మెరుపు ధర్నాకు దిగారు. యాలాల మండలం దౌలాపూర్, లక్ష్మీనారాయణ పూర్ పరిసరాలలో ఉన్న జిన్నింగ్ మిల్లులు మూత పడటంతో పత్తి కొనుగోళ్ళకు బ్రెక్ పడింది. దాంతో పత్తి విక్రయాల కోసం వచ్చిన రైతులు జిన్నివగ్ మిల్లుల ముందు ధార్నాకు దిగారు. ఈ మిల్లుల వద్దనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మిల్లర్లు తాత్కాలికంగా బంద్‌లో పాల్గొనడంతో సీసీ ఐ కొనుగోళ్ళకు బ్రేక్ పడింది. పత్తి రైతులు చేపట్టిన ఆందోళన సమాచారం తెలుసుకున్న యాలాల ఎస్సై విఠల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. కొంత సేపటికి జిన్నింగ్ మిల్లులు తెరుచుకోవటంతో పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగాయి.