రంగారెడ్డి

గీతాసారాన్ని ఆచరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, పరిగి నవంబర్ 17: గీతాసారాన్ని ప్రతి ఒక్కరూ అన్వయించుకుని ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుందని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సరస్వతీ శిశుమందిరం ఆవరణలో ఆదివారం సాహితీ సమితి శంకరమ్మ యోగిని సంస్థ సంయుక్తంగా నిర్వహించిన గీతాధారా కార్యక్రమంలో ముఖ్య తిథిగా విచ్చేసి మాట్లాడారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలను కసిరెడ్డితోపాటు, సాగి కమాలకర శర్మ, మావడూరి సూర్యనారాయణమూర్తి, సాంబశివశర్మ, ఆంజనేయరాజు విశే్లంచి చెప్పారు. కొంతమంది గీత శ్లోకాలను కంఠస్థం చేసి తాము గీత నేర్చుకున్నామని భ్రమ పడుతుంటారని పాడడం కాకుండా దాంట్లోని ప్రతి అంశాన్ని నిజ జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ఆరెస్సెస్ విభాగ్ భౌద్దిక్ ప్రముఖ్ కూర జయదేవుడు, ఆధ్యాత్వికవేత్త ఉపన్యాసకులు భాస్కరయోగి, ప్రముఖ వైద్యులు రాఘవేందర రావు, సాహితి సమితి జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణగౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి దోమ ఎంపీపీతోపాటు బీజేపీ నాయకులు తాండూరు మున్సిపల్ మాజీ ఛైర్మన్ నాగారం నర్సింలు, ఉప్పరి రమేశ్, ప్యాట బాలరెడ్డి, న్యాయవాది బాలవర్ధనరెడ్డి సన్మానించారు.