రంగారెడ్డి

పారిశుద్ధ్య నిర్వహణకు పకడ్బందీ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, నవంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్ నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని తగిన ప్రయత్నం చేస్తుందని, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బడంగ్‌పేట్ కార్పొరేషన్ అల్మాస్‌గూడ శ్రీహిల్స్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేసుకున్న శ్రీహిల్స్ కాలనీ రెసిడెంట్స్ వేల్ఫేర్ అసోసియోషన్ భవనాన్ని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, కమిషనర్ సత్యబాబు, డీఈ అశోక్ రెడ్డి, బడంగ్‌పేట్ కార్పొరేషన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ రామిడి కవిత రాం రెడ్డి, మాజీ కౌన్సిలర్ సమ్‌రెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, అసోసియోషన్ అధ్యక్షుడు మాధవరం శంకర్ రావుతో కలిసి ప్రారంభించడంతో పాటు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సబితా రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో కమ్యూనిటీ హాల్, మహిళా భవనం, సీనియర్ సిటిజన్ భవనాలు ఉండే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కొంత నిధులు, దాతల సహాయంతో రూ.10 లక్షల నిధులు సమకూర్చుకొని, అసోసియోషన్ భవనం నిర్మాణం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. శ్రీహిల్‌స కాలనీ అసోసియోషన్ భవనం అదనపు ఫ్లోర్ నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. కాలనీలో చెత్త లేకుండా చూసుకోవడం, ప్లాస్టిక్‌ను నిషేదించడంతో పాటు మొక్కలు పెంచాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రోడ్ల విస్తరణకు తగిన నిధులు కేటాయించి, పనులు చేపటినట్లు గుర్తు చేశారు. కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ, మంచి నీటి, రోడ్లు, వీధి దీపాలు వంటి వౌలిక వసతుల కల్పనకు తగిన కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్ణగంటి అర్జున్, మాజీ చైర్మన్లు సామ నర్సింహ గౌడ్, యాతం శ్రీశైలం యాదవ్, ఏఈ బిక్కు నాయక్, మాజీ కౌన్సిర్లు పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, గౌర శారద సత్యనారాయణ, ఇంద్రపల్లి యదగిరి, కాలనీ సంక్షేమ సభ్యులు వెంకట్ గౌడ్, శంకర్ నాయక్, వెంకట్ రెడ్డి, అంజనేయులు, యదగిరి, యదయ్య పాల్గొన్నారు.