రంగారెడ్డి

అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, నవంబర్ 11: అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ఆయుష్ వెల్నెస్ సెంటర్ లక్ష్యమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో వ్యవస్థాపకులు కమలేష్ జీ పటేల్ ఆధ్వర్యంలో ఆయుష్ వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కన్హాశాంతివనంలో మొక్కలు నాటారు. గ్రామీణ నిరుపేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకే కన్హాశాంతివనంలో ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కన్హాశాంతి వనానికి అంతర్జాతీయ స్థాయి నుంచి యోగా కోసం వస్తుంటారని వివరించారు. గత రెండు సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా కన్హాశాంతి వనానికి రెండు లక్షలకు పైగా సందర్శకులు వచ్చారని తెలిపారు. ఆయుష్ వెల్నెస్ సెంటర్‌ను 12నెలల్లో పూర్తి చేసిన ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కన్హా శాంతివనం ఒక వెల్నెస్ గమ్యస్థానంగా మారుతోందని, శరీరం, మనస్సు పెంపొందించే అందమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కొద్ది సంవత్సరాల క్రితం తిరిగి వచ్చిన విజన్ ఫలితం ఈ పరివర్తనలో ఉన్నాయని పేర్కొన్నారు. పర్యావరణ యెక్క పచ్చదనం, సహజమైన సృష్టి అంతరించుకుపోతున్న జాతులను, మద్దతు ఇచ్చే ఆవాసాలకు కన్హాశాంతివనం వేదిక అవుతుందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. కన్హాశాంతివనం కల్పిస్తున్న అవకాశాలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.