రంగారెడ్డి

మీరు చెబితే ఇప్పుడే సమ్మె విరమిస్తాం.. మంత్రి ఈటలతో ఆర్టీసీ కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 11: తెలంగాణ సాధన ఉద్యమంలో నాడు ముందున్న మేము నేడు మేమే లాఠీల దెబ్బలు తీనాల్సిన దుస్థితి నెలకొందని, 25 మంది కార్మికులు చనిపోతే కూడా కనీసం దయ కూడా లేదు.. శాంతియుతంగా స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నాం. అయినా సర్కార్ స్పందించడం లేదు.. ఆర్టీసీ పక్షపాతి అయిన మీరు స్పందించి నేను చేస్తా అని ఒక హామీ ఇస్తే ఇప్పుడే విధుల్లో చేరిపోతామని ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మొరపెట్టుకున్నారు. ట్యాంక్‌బండ్ పోలీసుల దమనకాండను నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు సోమవారం అధికార పార్టీ నాయకుల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ డిపో ఆర్టీసీ కార్మికులు మండలంలోని పూడూరు గ్రామ పరిధి ఓఆర్‌ఆర్ పక్కనే గల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నివాసం వద్ద బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
సమ్మె శాంతియూతంగా కొనసాగిస్తున్నామని వివరించారు. ఆర్టీసీ కార్మికులపై కనీసం సానుభూతి లేకపోవడం బాధకరమని అన్నారు. ఆర్టీసీ కార్మికులు మాకు న్యాయం చేయలంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి ఈటల స్పందిస్తూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని కార్మికులతో తెలిపారు. మేడ్చల్ డిపో నుంచి కార్మికులు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ మంత్రి ఈటల నివాసం వద్దకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ధర్నా సందర్భంగా పోలీసులు మంత్రి ఈటల నివాసం వద్ద గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
బాలాపూర్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జేఏసీ, అఖిల పక్షం నేతలు ఇచ్చిన పిలుపు మేరకు.. సోమవారం మలక్‌పేట్ తిరుమల హిల్స్‌లోని ఇబ్రహింపట్నం, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నివాసాలను బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్, ఇబ్రహింపట్నంకు చెందిన ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటిలో లేకపోవడంతో పీఏకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మంచి రెడ్డి కిషన్ రెడ్డి లేకపోవడంతో పోలీస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్షం నాయకులు పాల్గొన్నారు.
కార్మికుల డిమాండ్లను పరిష్కారించాలి: దేప భాస్కర్ రెడ్డి డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కారించాలని మహేశ్వరం అసెంబ్లీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపటిన సమ్మెలో భాగంగా జేఏసీ, అఖిల పక్షం నేతలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఆర్క్‌పురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలోని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్లిన దేప భాస్కర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులను ఆరెస్టు చేసి, చైతన్యపూరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో చిలుక ఉపేందర్ రెడ్డి, తలాటి వెంకటేష్ నేత, బండి మధు, శివ, మహేందర్, నాగేష్, భూపాల్ రెడ్డి, లక్ష్మయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.
షాద్‌నగర్: ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించారు. సోమవారం ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు బస్టాండ్ నుంచి ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని గేటు ఎదుట బైఠాయించారు. గేటు ముందు బైఠాయించిన జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు సమ్మెలో భాగంగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించి బైఠాయించడం జరిగిందని వివరించారు. గత 36రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికుల పట్ల ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదని అన్నారు. మహిళా కార్మికులని చూడకుండా ప్రభుత్వం పోలీసులతో ఇష్టారాజ్యంగా లాఠీచార్జీలు చేయించడం సరైన పద్ధతి కాదని అన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసిన హక్కులు సాధించుకోవడంతోపాటు డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగించనున్నట్లు హెచ్చరించారు.
వికారాబాద్: ఆర్టీసీ సమ్మెలో భాగంగా సోమవారం కార్మికులు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఇంటిని ముట్టడించిన నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పంధించిన ఎమ్మెల్యే కార్మికులతో మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు అశోక్, రాజేశ్వర్, డెవిడ్, రాములు, బ్రహ్మచారి ఉన్నారు.
మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్‌లకు వినతిపత్రాలు
సికింద్రాబాద్: జేఏసి పిలుపు మేరకు సోమవారం ఆర్టీసి కార్మికులు పలువురు అమాత్యుల ఇళ్ల ముందు నిరసనలు, బైఠాయింపులు నిర్వహించారు. ఆ తర్వాత తమ సమస్యలను పట్టించుకోవాలని కోరుతూ మంత్రులకు వినతులను సమర్పించారు. సికింద్రాబాద్‌లోని మంత్రుల ఇళ్ళను ముట్టడించేందుకు యత్నించారు.
దీన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం జూబ్లీ బస్టాండ్‌లో ధర్నా చేసిన పికెట్,కంటోనె్మంట్ డిపోలకు చెందిన కార్మికులు వెస్ట్‌మారేడ్‌పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇంటికి చేరకుని వినతిపత్రం అందజేశారు.
మంత్రి వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్టీసీకి అన్యాయం ఏమి చేయరని, క్యాబినెట్ సమావేశంలో చాలాసేపు చర్చించామని తెలిపారు. ముఖ్యమంత్రికి అన్ని విషయాలు తెలుసు, నేను కూడా వినతి పత్రాన్ని ఆయన దృష్ఠికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
జేఏసీ నేతలు మారెడ్‌పల్లి నుండి డిపూటీ స్పీకర్ ఇంటిని ముట్టడిస్తారన్న సమాచారంతో ఉండటంతో మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ మట్టయ్య, నార్త్‌జోన్ టాస్క్పోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ సేషన్‌కు తరలించారు. అరెస్టుయిన వారిలో నాగేష్ పటేల్, లాల్ ఉన్నారు. రాణిగంజ్ డిపోల కార్మికులు డిపూటీ స్పీకర్ పద్మారావు ఇంటిని ముట్టడించారు.
అక్కడికి చేరుకున్న కార్మికులు పద్మారావుకు వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతామని బందోబస్తులో ఉన్న మార్కెట్ ఇన్‌స్పెక్టర్ శంకర్ యదవ్‌ను కోరగా, మంత్రి ఇంట్లో లేడని తెలుపడంతో ఇంట్లో ఉన్న వారికే ఇచ్చి వెళ్తామని విజ్ఞప్తి చేశారు. ఎంతకు పోలీసులు అనుమతించకపోవటంతో కార్మికులు అక్కడే బైఠాయించారు. ఆ తర్వాత పద్మారావు కొడుకు రామేశ్వర్ గౌడ్ రోడ్డుపైకి వచ్చి వారి వినతి పత్రాన్ని స్వీకరించడంతో కార్మికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రాజేంద్రనగర్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మొదటి రోజు నుంచి ఎమ్మార్పీ ఎస్ మద్దతు పలికి ముందుండి పోరాడుతుందని ఎమ్మార్పీ ఎస్ వ్యవస్ధాపకుడు మంద కృష్ణమాదిగ వెల్లడించారు.
రాజేంద్రనగర్ ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా సోమవారం డిపో ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు వనం నర్సింహ మాదిగ పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగల సమస్యలను పట్టించుకోకుండా కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన అవసరం వచ్చిందని ఆర్టీసీ జేసీ నాయకులు వెల్లడించారు. సోమవారం మైలార్‌దేవ్‌పల్లి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఇంటిని ముట్టడించారు. కార్యక్రమంలో నర్సింహ రెడ్డి, ముత్యంరెడ్డి, అనంతయ్య, జయలక్ష్మి, కళావతి, అనిత, నిర్మల, సరిత ఉన్నారు.
పరిగి: ఆర్టీసీ కార్మీకుల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య అన్నారు. సోమవారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఇంటిని ఆర్టీసీ కార్మీకులు వామ పక్షపార్టీల నాయకులు ముట్టడించారు. పరిగి డీఎస్పీశ్రీనివాస్, సీఐ మొగులయ్య, చన్‌గోమూల్, పరిగి, దోమ, కుల్కచర్ల, మండలాలకు చెందిన ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు.