రంగారెడ్డి

డ్రైనేజీ ఔట్ లేట్ పరిష్కారానికి వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, నవంబర్ 11: మీర్‌పేట్ కార్పొరేషన్ జిల్లెలగూడ పరిధిలోని సాయి సామ్రాట్ నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మీర్‌పేట్ కమిషనర్ సుమన్ రావును ఆదేశించినట్లు జిల్లెలగూడ టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం సరూర్‌నగర్ మండల టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, సిద్దాల బాలప్ప, సిద్దాల బీరప్ప, లాడ్స్ స్కూల్స్ చైర్మన్ సిద్దాల బీరప్ప కమిషనర్ సుమన్ రావును కార్యాలయంలో కలిసి మంత్రి ఇచ్చిన లేఖను అందజేశారు. కార్యక్రమంలో మేనేజర్లు ఉపేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
బడంగ్‌పేట్ సరస్వతీ శిశుమందిర్‌కు చేయూత
బాలాపూర్, నవంబర్ 11: హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ దాదాపు 42 సంవత్సరాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగా బడంగ్‌పేట్ సరస్వతీ శిశుమందిర్‌లో చదువుతున్న విద్యార్థుల కోసం 48 టేబుల్స్ విరాళంగా అందజేస్తున్నట్లు హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బాశెట్టి హరినాథ్ పేర్కొన్నారు. హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ అధ్వర్యంలో సమకూరిన 48 టేబుళ్లను సోమవారం బడంగ్‌పేట్ సనస్వతీ శిశుమందిర్ పాఠశాలకు అందజేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హరినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బడంగ్‌పేట్ సరస్వతీ శిశుమందిర్‌కు రూ.లక్ష 50 వేల విలువగల మంచి నీటి ప్యూర్‌ఫైడ్ ఏర్పాటు చేయించడంతో పాటు ప్రతి ఏడాది నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిలు అందజేస్తున్నుట్లు తెలిపారు. కార్యక్రమంలో బడంగ్‌పేట్ సరస్వతీ శిశుమందిర్ గౌరవ అధ్యక్షుడు సామ సంజీవ రెడ్డి, మాజీ సర్పంచ్, శిశుమందిర్ ప్రధాన కార్యదర్శి నడికూడి యాదగిరి బడంగ్‌పేట్ సరస్వతీ శిశుమందిర్ అధ్యక్షుడు సామ సంజీవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నడికూడి యదగిరి, వైస్ ప్రెసిడెంట్ పెద్దబావి సమరసింహ రెడ్డి, ప్రాజేక్టు చైర్మన్ కొత్త శ్రీకాంత్, పూరి వీరేష్, హైదరాబాద్ వైశ్య అసోసియేషన్ అధ్యక్షుడు నల్లా సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి శేరి వెంకటేష్, ట్రెసరర్ మెడిశేట్టి నరేష్, శివుమందిర్ సభ్యులు గుట్ట బాకిష్ణ, గణేష్ గౌడ్, చిత్రం శ్రీనువాస్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
బేడ బుడగ జంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
బాలాపూర్, నవంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం బేడ బుడగ జంగం కులం అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, వాటిని బేడ బుడగ జంగం కులస్తులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేట్‌లోని బాబుజగ్జీవన్ రామ్‌భవన్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా బేడ బుడగ జంగం వెల్ఫర్ ఫేడరేషన్ 14వ వార్షిక జాతీయ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రసంగించారు. కార్యక్రమంలో బేడ బుడగ జంగం వెల్ఫర్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు చింతల యాదగిరి, బేడ బుడగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కొండగిరి నర్సింహ, హక్కుల దండు రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం, సంక్షేమ సంఘం అధ్యక్షుడు వస్తం యాదయ్య జాతీయ నాయకులు మనోహర్, సంజీవ, అంజయ్య పాల్గొన్నారు.
అనంతరం బేడ బుడగ జంగం ఆల్ ఇండియా వెల్ఫర్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాని ఎన్నుకున్నారు. గౌవర అధ్యక్షుడిగా వస్తం యాదయ్య, అధ్యక్షుడిగా డాక్టర్ చింతల యాదగిరి, వర్కింగ్ అధ్యక్షుడిగా ఉపేందర్ కుమార్, ఉపాధ్యాక్షులుగా అంజనయ్య, సంజీవ, శ్రీనివాస్, రామ్ కుమార్, రాంచందర్, సైదులు ఎన్నుకున్నారు.