రంగారెడ్డి

మద్యం వద్దు.. బడి ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 10: మద్యం వద్దు.. బడులు ముద్దు అనే నినాదంతో బోడుప్పల్ ప్రజలు వైన్ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఇళ్ల మధ్య వైన్ షాపులా? ఇదేమిటి అంటూ వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యానర్లతో బోడుప్పల్ వీరారెడ్డి నగర్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చిల్కానగర్ ప్రధాన రహదారిలో మూడు రోజుల క్రితం వైన్‌షాపు కోసం అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను మహిళల ఆందోళనపై స్పందించిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రాంతంలో వైన్‌షాపునకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. దీంతో కోట్లు వెచ్చించి తెచ్చుకున్న వైన్‌షాపును సదరు యజమాని నెత్తికి చేతులు పెట్టుకుని ఇదేమిరా బాబూ అంటూ విచారణలో నిమగ్నమయ్యారు.