రంగారెడ్డి

ఆర్టీసీ సమ్మె ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, నవంబర్ 10: ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె ప్రభావం కాస్తా ప్రభుత్వ పాఠశాలలపై పడింది. సెప్టెంబర్ 5వ తేది నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో బస్సులు గ్రామీణ రోడ్లు ఎక్కడ లేదు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం క్రమంగా తగ్గిపోయింది. గత నెల సెప్టెంబర్ 25వ తేది నుంచి నవంబర్ 7వ తేది వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు విద్యార్థులు ఆశించిన స్థాయిలో హాజరు కాకపోవడం ఆర్టీసీ సమ్మెనే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. 36 రోజులుగా బస్సులు పల్లెలకు వెళ్ళకపోవడంతో పల్లెవాసులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు సక్రమంగా హాజరు కాకపోవడంతో హాజరు శాతం ఐదు నుంచి పదిశాతం తగ్గినట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ఇప్పట్లో ఆర్టీసీ సమ్మె తగ్గే టట్లు లేదంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు. తరగతిలో హాజరు శాతం తగ్గడంతో వార్షిక పరీక్ష ఫీజులు తీసుకునేందుకు కళాశాల యజమాన్యాలు వెనుకంజ వేస్తున్నారు. ఆర్టీసి సమ్మెతోనే తాము ఇన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యార్థులు అంటున్నారు. దానికి ప్రభుత్వం విద్యార్థులు, టీచర్లకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగిన యూ-డైస్ డాటాను అనుసంధానం చేసింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడితోపాటు పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు బాధ్యత చూసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బయోమెట్రిక్ ఆధారితంగా హాజరు శాతం నమోదు చేస్తున్నారు. మొదట్లో ఈ యాప్ సక్రమంగా హాజరు శాతం నమోదు చేయలేదు.. కానీ విద్యాశాఖ అధికారులు స్పష్టమైన అదేశాలు జారీ చేయడంతో హాజరు శాతం నమోదు చేసింది. విద్యార్థుల హాజరు 87 శాతం నుంచి 77 శాతానికి, ఉపాధ్యాయుల హాజరు 88 శాతం నుంచి 80 శాతానికి తగ్గినట్లు విద్యాశాఖ అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి.