రంగారెడ్డి

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 10: చేనే త కార్మికులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం కాటేదాన్‌లోని బావనరుషి కాలనీలో నూతనంగా నిర్మించిన మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవన కల్యాణ మండ కార్యాలయాన్ని ముఖ్య అతిధిగా హజరై ప్రారంభించారు. రాష్ట్రంలో చేనేత మోడ్రనైజేషన్‌కు అనగుణంగా ప్రభుత్వం తగినసహకారంతో ఆదుకోవడానికి కృషి చేస్తుందన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని పద్మశాలీలు ఏకతాటిపైకి వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసుకోని కల్యాణ మండం నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రాథమికంగా భవన నిర్మాణానికి సంబంధించి తాను కూడా రూ.50 వేలు చెల్లించి మీలో సభ్యత్వం తీసుకుంటాన్నారు. దాదాపు రూ.1.5 కోట్ల నిధి విరాళంగా జమ చేసి ఇంత వరక నిర్మాణ పనులు తీసుకురావడం గోప్ప విషయమని అన్నారు. యువత ముందుకు వస్తే క్రీడా సామాగ్రీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోషిక యాదగిరి, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ టీ.ప్రేమ్‌దాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు నిరంజన్, ప్రధా న కార్యదర్శి ఏర్వ సత్యనారాయణ, మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జీ.వెంకటేష్, సలహాదారులు ఎం.వెంకటేష్, బొల్ల శ్రీనివాస్, సూర్యనారాయణ, ఎం.చంద్ర య్య, సూర్యకిరణ్, రాపోలు సత్తయ్య, తిమ్మయ్య, వైస్ చైర్మన్లు యూ.విజయ్‌కుమార్, బాస శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు ఎం. విష్ణు, బీ.యాదగిరి, ప్రచార కార్యదర్శులు ఎస్.యా దయ్య, ఎం.నర్సింహ, సభ్యులు నిరంజన్, జీ.వెంకటేష్, సంఘం నేత వర్కాల శ్రీరాములు, వెంగలి నర్సిం హ, బి.నరేందర్, వాసు, శ్రీనివాస్, రా జు, దత్తు, రమేష్, ఆశోక్, రాధాకృష్ణ, ఈ.చిరంజీవి, శేఖర్, యాదవరెడ్డి, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.

అనాథ ఆశ్రమానికి
భుజంగ రెడ్డి రూ.5 వేల విరాళం
బాలాపూర్, నవంబర్ 10: సీనియర్ పాత్రీకేయులు భుజంగరెడ్డి తన జన్మదిన వేడుకలను ఆదివారం బడంగ్‌పేట్ కార్పొరేషన్ నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. భుజంగ రెడ్డి అనాథ ఆశ్రమంలో ఉన్న యాబై మందికి భోజనాలు ఏర్పాటు చేయించి, తన స్వహస్తలతో అనాథలకు వడ్డించారు. ఆశ్రమం నిర్వహకులు గట్టు గిరి మాట్లాడుతూ..సీనియర్ పాత్రీకేయులు భుజంగ రెడ్డి తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆశ్రమంలోని అనాథలకు భోజనాలు రూ.5 వేల విరాళంగా అందజేసినట్లు తెలిపారు. భుజంగ రెడ్డి తమ ఆశ్రమానికి అన్ని విధాల తన సహయ సకరాలు అందిస్తుంటారని గుర్తు చేశారు.