రంగారెడ్డి

సమ్మెతో ఆర్టీసీ ఆదాయానికి గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, నవంబర్ 10: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సు డిపోల్లో అత్యధిక ఆదాయాన్ని సాధించే ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డీపో ఆదాయం పూర్తిగా తగ్గిపోయి ప్రస్తుతం నష్టాల్లోకి కూరుకుపోతోంది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన 171 బస్సులు నిత్యం నగరంతో పాటు నియోజకవర్గ పరిధిలోని యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాలతో పాటు నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతాలైన చౌటుప్పల్, మాల్, మర్రిగూడ, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుండేవి. దీంతో నిత్యం ఆర్టీసీ బస్సులు 52 వేల కిలోమీటర్ల మేరా తిరిగి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తూ రూ.9 లక్షల రోజూవారీ ఆదాయాన్ని పొందేది. ప్రస్తుతం రోజూవారీగా కేవలం 30 నుంచి 40 బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తుండడంతో రూ. 1.43 లక్షల ఆదాయం మాత్రమే వస్తోంది. చాలా వరకు ఆర్టీసీ బస్సులు ఇబ్రహీంపట్నం డిపోకే పరిమితం కావడంతో అటు ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఆర్టీసీ బస్సులనే నమ్ముకొని వేలాది మంది ప్రయాణీకులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులు డివిజన్ నుంచి నగరానికి, నగరం నుంచి డివిజన్‌కు ప్రయాణాలు సాగిస్తున్నారు. వారిపై ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
డిపోలో మొత్తం 831 మంది కార్మికులు పనిచేస్తుండగా వారంతా ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. తాత్కాలికంగా కేవలం 30 నుంచి నలబై బస్సులకు మాత్రమే తాత్కాలిక సిబ్బందితో పోలీసుల బందోబస్తు మధ్య నడుస్తున్నాయి. గత 38 రోజుల్లో రూ. 3.42 కోట్లు రావాల్సిన ఆదాయం అమాంతం రూ. 54.34 లక్షలకు పడిపోయింది. ముఖ్యంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొడంగల్: ఆర్‌టీసీ కార్మికుల సమ్మెకు మద్దతునిస్తు ప్రజాసంఘాల ఆద్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.
ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలోబాగంగా ఆర్‌టీసీ కార్మికులపైన దౌర్జన్యంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
పలువురు నాయకులు మాట్లాడుతు కార్మికుల సమ్మె చేయడం ఆపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో బీఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా ఉపాధ్యాక్షుడు బుస్స చంద్రయ్య పాల్గొన్నారు.