రంగారెడ్డి

ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 23: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బుధవారం బోడుప్పల్‌లోని ‘రాచెరువు’ పరిసర ముంపు ప్రాంతాలలో పర్యటించారు. చెరువు నుంచి సుద్దకుంట మీదుగా ఉప్పల్ నల్ల చెరువు వరకు మధ్యలో ఉన్న మురికి కాలువ పరిసర ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. నిత్యం కురుస్తున్న వర్షాలకు తోడుగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ మురుగు నీటితో దుర్వాసన, దుర్గందం వెదజల్లడంతో ఊపిరి పీల్చుకోలేక విష జ్వరాలతో దుర్భర జీవనం గడుపుతున్నామని గోడును విలపించారు. దశాబ్ధాల కాలం నుంచి సమస్యతో బాధపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడల్లోని కెమికల్ పరిశ్రమల నుంచి వెదజల్లే విషపూరితమైన రసాయనాలు కలుషితమై పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కలుషితమై ఉపయోగం లేకుండా పోయాయని ఆరోపించారు. సమస్యలపై మంత్రి స్పందించి చిత్తశుద్ధితో రా చెరువును పరిశుభ్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పారిశ్రామికవాడల నుంచి కెమికల్ రసాయనాలు చెరువులో కలువకుండా ఎస్‌టీపీలను ఏర్పాటు చేసుకునేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్తానని వివరించారు. తక్షణమే స్పందించి జేసీబీ సాయంతో నాలాలను శుభ్రం చేయాలని కమిషనర్ శంకర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ మంజుల, కమిషనర్ శంకర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి వెంకట్, మాజీ జడ్పీటీసీ సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఇచ్చిన సమయానికి చెరువు చెరువు వద్దకు హాజరు కాకుండా ఆలస్యంగా వచ్చి మురికికాలువ పరిసర ముంపు ప్రాంతాలలో పర్యటించి వెళ్లిపోవడం గమనార్హం. చెరువు వద్ద మంత్రి రాక కోసం స్వచ్చంద సంస్థలు, కాలనీ, యువజన సంఘాల ప్రతినిధులు మూడు గంటల వరకు చేరుకున్నారు.