రంగారెడ్డి

డిపోల్లోని బస్సులన్నీ బయటకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 16: ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా డిపోలలోని బస్సులన్నింటిని నడిపేవిదంగా చర్యలు చేపట్టాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిపో మేనేజర్లు, నోడల్ అధికారులు, తహశీల్దార్లు, టాస్క్ఫోర్స్, పోలీసు అధికారులతో రవాణా సౌకర్యాలను సమీక్షించారు. బస్సు డిపోలకు అవసరమైన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, షానిటేషన్ వర్కర్లను నియమించాలని అన్నారు. డిపోలలో పరిశుభ్రతను పాటించాలని, శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి డిపోలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఐటెక్, మెట్రో బస్సులను నడపాలని చెప్పారు. డిపోల బయట పోలీసు భద్రతను నిర్వహిస్తున్న సిబ్బందికి సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఏడు డిపోల నుంచి 62 శాతం బస్సులు నడుస్తున్నాయని, గురువారం నుంచి అన్ని బస్సులు నడిచేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్వో మధుసూదన్ రెడ్డి, రవాణా శాఖా అధికారులు కిషన్, రవీందర్, నరేందర్ పాల్గొన్నారు.