రంగారెడ్డి

అదే హోరు.. అదే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 16: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చెంగిచర్ల, ఉప్పల్ బస్ డిపో కార్మికులు వరంగల్ జాతీయ రహదారిలోని చెంగిచర్ల, మేడిపల్లి, పీర్జాదిగూడలో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం డిపో ఎదుట రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ నాయకత్వంలో బోడుప్పల్, చెంగిచర్ల, మేడిపల్లి, పీర్జాదిగూడ, పర్వతాపూర్, ఉప్పల్, రామంతాపూర్, చిల్కానగర్, హబ్సిగూడ డివిజన్ల నుంచి వందలాది మంది బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీచర్స్, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలతో వచ్చి ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.