రంగారెడ్డి

85 శాతం బస్సులు నడుస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 15: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ప్రజలకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని 85 శాతం బస్సులు నడుస్తున్నాయని కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు.
కలెక్టర్ మంగళవారం సాయంత్రం మేడ్చల్‌లో ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులను తనిఖీ చేయడంతో పాటు డిపోను పరిశీలించారు. మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులోకి వెళ్లి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారా అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్రైవర్, కండక్టర్‌లతో మాట్లాడి ప్రయాణికులకు మంచి సేవలు అందించాలని సూచించారు. అక్కడి నుంచి డిపోకు చేరుకున్న కలెక్టర్ డిపో అధికారులతో కలిసి బస్సులను పరిశీలించారు.
డిపోను పరిశీలించి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 980 బస్సులకు గాను సుమారు 800 బస్సులు నడిపిస్తున్నట్లు వివరించారు. ఆర్టీసీ అద్దె, పాఠశాలల బస్సులతో పాటు అదనంగా సెవన్ సీటర్ ఆటోలు, క్యాబ్‌లు కూడా నడిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నడుస్తుందని అన్నారు. ప్రతీ డిపోకు సీనియర్ అధికారులతో కమిటీ వేసి రోజు వారిగా సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డీఎం, ఎంవీఐ, తహశీల్దార్ డిపో స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి వారు ఎప్పటికప్పుడు పరిస్థిని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. బస్సులను శుభ్రం చేసేందుకు అదనపు కూలీలను సమకూర్చుకోవాలని డీఎం ప్రకాశ్ రావుకు సూచించారు. కార్యక్రమంలో సీఈఓ దేవసహాయం, తహశీల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ ఏఈ రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.