రంగారెడ్డి

చెక్కులు తీసుకున్నారు.. ఖాళీ చేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 15: ఉప్పల్ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. విస్తరణలో భాగంగా మేడిపల్లి వైపు నుంచి ఎలివేటెడ్ కారిడార్ ఫిల్లర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విస్తరణలో భాగంగా నష్టపోయిన భవన యజమానులకు నష్టపరిహారం కింద చెక్కులు తీసుకున్నా.. షాపులు ఎందుకు ఖాళీ చేయడంలేదని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందితో ఖాళీ చేయించడానికి రంగంలోకి దిగారు. షాపుల యజమానుల కోరిక మేరకు దసరా వరకు అవకాశం ఇచ్చినా సకాలంలో ఖాళీ చేయలేదని, బలవంతంగా ఖాళీ చేయించే క్రమంలో షాపులను క్లోజ్ చేయించామని అధికారులు అంటున్నారు. మంగళవారం రహదారిలోని మేకల కాంప్లెక్స్, జెట్ట కాంప్లెక్స్‌లోని 30 షాపులను ఖాళీ చేయించామని టీపీఎస్ సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

తాత్కాలిక ఉద్యోగం కోసం
బస్‌డిపో వద్ద నిరుద్యోగుల క్యూ

ఉప్పల్, అక్టోబర్ 15: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డ్రైవర్, కండక్టర్, ఇతర తాత్కాలిక ఉద్యోగాల కోసం పిలిచిన ఇంటర్వ్యూల కోసం నిరుద్యోగులు బస్‌డిపోల వద్ద క్యూకట్టారు. ఉదయాన్ని వచ్చిన డిపోల వద్ద గంటల కొద్దీ క్యూలో నిల్చొన్నా ఉద్యోగం దక్కకపోవడంతో నిరాశతో వెళ్లిపోతున్నారు. నిత్యం 100 నుంచి 200 మంది స్టడీ సర్ట్ఫికెట్లతో వచ్చి క్యూలో నిల్చొంటున్నారు. అయినప్పటికీ అవసరమైన సిబ్బందిని మాత్రమే తీసుకుంటుండటంతో మిగితావారు తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. విధులు నిర్వహిస్తున్న కొందరు జీతానికి సరిపడే డబ్బులు మాత్రమే తెస్తున్నారని, ఆదాయం తీసుకురావడం లేదని సమచారం.