రంగారెడ్డి

నారపల్లి సమస్యలన్ని పరిష్కరిస్తా: మంత్రి మల్లరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, అక్టోబర్ 15: నారపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. పోచారం పురపాలక సంఘం నారపల్లిలో గత కొంత కాలంగా తాగునీటి ఎద్దడి, సీసీ రోడ్లు, వీధి దీపాల సమస్యలు నెలకొనటంతో మాజీ సర్పంచ్ మందడి సురేందర్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. నారపల్లిలోని పలు వార్డులలో ప్రజలు తాగునీటి ఎద్దడితో పాటు సీసీ రోడ్లు, వీది దీపాలు లేక పడుతున్న ఇబ్బందులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటంతో పలువురు అధికారులు నారపల్లిలో మంగళవారం పర్యటించి సమస్యలను మంత్రికి వివరించారు. నారపల్లిలో నెలకొన్న సమస్యలను పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని పరిష్కరిస్తానని మంత్రి హామి ఇచ్చారు. నారపల్లిలో నెలకొన్న సమస్యలను అధికారులకు మందడి సురేందర్ రెడ్డి దగ్గర ఉండి చూపించారు. ఏఈ యాదగిరి, డిజీఎం ఉమాపతి, రాజ్‌కుమార్, స్థానిక నాయకులు ఎండీ అక్రమ్, ఎం శ్రీనివాస్, ఆర్ రామారావు, అంజనేయులు, నసీర్‌ఖాన్ పాల్గొన్నారు.

మానవాళికి ఉపయోగపడే
ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 15: మానవాళికి, దేశ ప్రగతికి ఉపయోపడే ఆవిష్కరణలకు విద్యార్థులు శ్రీకారం చుట్టాలని జేఎన్‌టీయూహెచ్ అకాడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ డాక్టర్ కే.రామ్మోహన్ రెడ్డి, శ్రీదత్త విద్యాసంస్థల చైర్మన్ జీ.పాండురంగా రెడ్డి సూచించారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీదత్త ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్ రీసెర్చ్ ఇన్ ఇంజనీరింగ్ అప్లయిడ్ సైన్స్ ఆండ్ మేనేజ్‌మెంట్ పేరిట అంతర్జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు. సదస్సును విద్యాసంస్థల వైస్ చైర్మన్ విభవ్‌రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ సమీరోద్దీన్‌ఖాన్ ప్రారంభించారు. మనం నిత్యం సతమతమవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా భావితరాలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేపట్టాలని అన్నారు. సదస్సు మ్యాగజైన్‌ను ఆవిష్కరించి విద్యార్థులకు అంకితం చేశారు. సదస్సులో శ్రీదత్త ఇన్‌స్టిట్యూషన్స్ వివిధ విభాగాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ శ్రీనివాస్, వెంకట ప్రశాంత్, రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సౌరభ్‌కుమార్ జైన్ పాల్గొన్నారు.