రంగారెడ్డి

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, అక్టోబర్ 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామీణ ప్రాంతాలకు వౌలికసదుపాయాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్టవ్రిద్యాశాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం కందుకూర్ మండలంలో పలు గ్రామాల్లో బీటీ రోడ్డు, సీసీరోడ్డు, అండర్ డ్రైనేజీ పనులను జిల్లా చైర్‌పర్సన్ తీగల అనితా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డితో కలిసి కందుకూర్ నుంచి మహేశ్వరం మండలం కోళ్లపడకల్ వరకు 16 కిలోమీటర్లు రోడ్లును శంకుస్థాపన చేశారు. గ్రామాలు అబివృద్ది చెందే విధంగా 30 రోజుల ప్రణాళిక విధంగా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ జంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మి నర్సింహ రెడ్డి, మనే్న జయేందర్, అంజయ్య గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, కే.చంద్రయ్య ముదిరాజ్, ఎం.నవీన్, పెద్దరామయ్య పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
శంషాబాద్, అక్టోబర్ 15: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్ గూడ గ్రామానికి చెందిన చంద్రయ్య గత కొంత కాలంగా అనారోగ్యానికి గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా రూ.12లక్షలకుపైగా వైద్య ఖర్చులు అయ్యాయి. బాధితుడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా 7.50లక్షల రూపాలయల చెక్కును పట్టణ అధ్యక్షుడు దూడల వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో పార్టి అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు కొలను మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, మేకల వెంకటేష్, నజిమోద్దీన్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, హనమంతు పాల్గొన్నారు.