రంగారెడ్డి

భగీరథ పనుల్లో జాప్యంపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, అక్టోబర్ 13: వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మిషన్ భగీరథ పథకం పనులను అధికారులు, కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని, జాప్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ వివరించారు.
ఆదివారం షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, భగీరథ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ కృష్ణా నీళ్లు పట్టణానికి వచ్చినప్పటికీ పనులు పూర్తి చేయడంలో అధికారులు, కాంట్రాక్టర్లు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో చెప్పాలని స్పష్టం చేశారు. నీటి ట్యాంకుల నిర్మాణాలు, పైపులైన్ల పనులపై యాక్షన్ ప్లాన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటూ అధికారులను ప్రశ్నించారు. భగీరథ పనుల కాంట్రాక్ట్ పొంది ఏడాదిన్నర కాలం గడుస్తున్నా నేటి వరకు పనులు చేపట్టకపోవడంలో అంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు.
పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపేర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను అదేశించారు. పది రోజుల్లో మిషన్ భగీరథ పనులు ప్రారంభం కాకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులు గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి వసతి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, గతంలో ఉన్న నల్లా కనెక్షన్లతోనే భగీరథ నీళ్లు ఇచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. పైపులైన్ నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి పూర్తి స్థాయిలో త్వరలోనే వస్తుందని, కాంట్రాక్టర్లు, అధికారులు పనుల్లో వేగం పెంచి సాధ్యమైనంత వరకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నీటి ట్యాంకుల నిర్మాణాల్లో జాప్యం వహించిన కాంట్రాక్టర్లను తొలగించి కొత్తవారికి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఓహెచ్‌ఆర్ నీటి ట్యాంకుల నిర్మాణాలు ఈఎన్‌సీ పరిధిలో ఉందని కమిషనర్ శరత్‌చంద్ర తెలపగా కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో షాద్‌నగర్ ఆర్డీఓ ఎం.కృష్ణ, తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్ర ఉన్నారు.