రంగారెడ్డి

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13: ప్ర భుత్వం నిరంకుశత్వాన్ని వీడి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా కార్మికులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కార్మికులు ఆర్టీసీ సంస్థను కాపాడేందుకే సమ్మెకు దిగారని స్పష్టం చేశారు. కార్మికులకు మద్దతుగా భాజపా నిలుస్తుందని, వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. ఖమ్మం లో ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతి బాధాకరమని, అతని కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు చందర్, శ్రీనివాస్ గౌడ్, యాదయ్య, సదానందం పాల్గొన్నారు.
మంత్రి సబితమ్మకు నోట్‌బుక్స్ విరాళం
శేరిలింగంపల్లి, అక్టోబర్ 13: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డిని శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నేతలు కలిసి నోట్‌బుక్స్ విరాళంగా అందజేశారు. ఆదివారం శేరిలింగంపల్లి మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కట్ల రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సబితమ్మ, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.
మంత్రి, ఎంపీని కలిసినవారిలో మాజీ కౌన్సిలర్లు యాదయ్య, కే.సునీతా రెడ్డి, టీటీయూసీ నాయకుడు నల్ల సంజీవ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, జీ.జనార్ధన్ రెడ్డి, రాములు, కే.ప్రభాకర్ రెడ్డి, వరహాల్ రెడ్డి, వడ్డెర సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాదయ్య, ఎల్లమయ్య, పున్నయ్య చౌదరి, విజయా రెడ్డి, ఎం.శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, సైదిరెడ్డి, రవీందర్ రెడ్డి, జయేందర్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ శాసనసభలో తొలి మహిళా మంత్రిగా నియమితులవడం గర్వంగా ఉందని కట్ల రఘుపతి రెడ్డి పేర్కొన్నారు.