రంగారెడ్డి

సనాతన ధర్మ పరిరక్షణ విద్య అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 13: సనాతన ధర్మ పరిరక్షణకు దోహదపడే వేద విద్యను భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తిరుపతి తిరుమల దేవస్థానం కార్యాచరణ రూపొందిస్తుందని తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వాహణాధికారి పీ.బసంత్ కుమార్ అన్నారు. ఆదివారం కీసరగుట్టలోని తిరుపతి తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద సంస్కృతి పాఠశాల 22వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వేద విద్యార్థులకు వేద విద్యతో పాటు ప్రపంచ విజ్ఞానాన్ని అందించినపుడే సమాజానికి దిశా నిర్ధేశం చేస్తారని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి క్రీడల్లో తర్పీదునిస్తామని అన్నారు. ఆంగ్లంలో పట్టు సాధించేలా కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి అనీల్ కుమార్ సింఘాల్, ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆరేళ్ల విభిషణ శర్మ, రాష్టప్రతి సన్మాన గ్రహీత డాక్టర్ విష్ణ్భుట్ల సుబ్రమణ్యం, డాక్టర్ విశ్వనాధ గోపాల కృష్ణ, వేద విద్యానిధి ఎం.్భమ శంకర శాస్ర్తి, కోట నాగరాజ శర్మ విద్యార్థులకు దిశా నిర్ధేశం చేశారు. పాఠశాలలో 12 ఏళ్ల వేద విద్యను పూర్తిచేసుకున్న విద్యార్థులకు స్నాతకోత్సవం జరిగింది. అతిథుల చేతుల మీదుగా యోగ్యతా పత్రాల ప్రధానం జరిగింది. తిరుపతి దేవస్థానం తరపున బ్యాంకులో జమ చేసిన వృద్ధి సొమ్మును అందజేశారు. గండికోట సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రధమ శ్రేణిలో నిలిచిన విద్యార్థులకు స్వర్ణ, రజత పథకాలను అందజేశారు. వెంకట రామ లక్ష్మి నరసమ్మ మహాదేవయ్య మెమోరియల్ ట్రస్టు నుంచి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. వేద పాఠశాల ప్రధానాచార్యులు దైత మల్లికార్జున అవధాని పాఠశాల నివేదిక చదివి విన్పించారు.