రంగారెడ్డి

అంటూ వ్యాధుల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, సెప్టెంబర్ 18: అంటూ వ్యాధుల పట్ల శానిటేషన్ అధికారులు ఆప్రమత్తంగా ఉండలని గ్రేటర్ ఆడిషనల్ కమిషనర్ జయరాజ్ కేనాడి కాప్రా కమిషనర్ దశరథకు ఆదేశించారు. విలేఖర్లతో మాట్లాడుతూ కాప్రా సర్కిల్ పరిధిలో డివిజన్‌ల వారికా ఎంటమాలజీ అధికారులు, సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షకాలంలో దోమలు వ్యాప్తి చెందకుండా లార్వాపై మందులు వేయలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మైత్రేయి, రమేష్ ధన గౌడ్, మెరుగు విష్ణు పాల్గొన్నారు.
కార్మికులకు భవన నిర్మాణ రంగంలో ఉపాధి
మహేశ్వరం, సెప్టెంబర్ 18. కార్మికులకు భవన నిర్మాణ రంగంలో ఉపాధి కల్పిస్తామని ఎన్‌ఏసీ ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ పీ.మిజలింగప్ప అన్నారు. నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఎన్‌ఏసీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులకు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు కర్రోళ్ల చంద్రయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, శంకర్, శ్రీశైలం, ప్రకాష్, చెన్నయ్య పాల్గొన్నారు.
చిన్నపిల్లలను సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవాలి
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 18: చిన్నపిల్లలను సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్‌లోని మహిళా భవనంలో నిర్వహించిన రోటా వైరస్ వాక్సిన్ లాంఛింగ్ కార్యక్రమానికి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు. కార్యక్రమాన్ని చేపట్టిన వారిని కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. డాక్టర్ వామన్‌రావు, చంద్రకళ, శిరీష, ఆశావర్కర్లు సరస్వతీ, మంజుల, శ్రీకాంత్‌రెడ్డి, జైరామ్, ఏ.శేఖర్, సత్యనారాయణ, బాల్‌రెడ్డి, ఎన్.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.