రంగారెడ్డి

హెల్మెట్ లేకుంటే ‘నో’ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 18: రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. రింగ్‌రోడ్డులో బుధవా రం స్పెషల్ డ్రైవ్..కౌనె్సలింగ్‌తో వాహనాదారుల్లో మార్పు తీసుకొస్తున్నారు. హెల్మెట్ లేకుంటే నో కేసులు..తప్పని సరిగా హెల్మెట్ కొనుగోలు చేసి పెట్టుకోవాల్సిందేనని హితవు పలుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస రావు, ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాద్, ఏఎస్‌ఐ శ్రీనివాస రావు, గంగాధర్ సిబ్బంది వచ్చిపోయే వాహనాదారులను మరీ ఆపి వారికి నచ్చే పద్ధతిలో ట్రాఫిక్ నిబంధనలపై వివరిస్తున్నారు. రహదారి ప్రమాదాలను నివారించాలంటే జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రమాదం జరుగకుండా హెల్మెట్‌ను వినియోగించాలని, లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్ట్ఫికెట్‌లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. లైసన్స్ లేని వారికి అధికారుల సహకారంతో ఇప్పిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు.
ట్రాఫిక్ రూల్స్‌పై
విద్యార్థులకు అవగాహన
నార్సింగి: ప్రతి విద్యార్థి ట్రాఫిక్ రూల్స్‌ను తెలుసుకోని తమ ఇంట్లో వాళ్లతో పాటు పరిసరాల ప్రజలకు అవగాహన కల్పించాలని సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సిటిట్యూట్ కానిస్టేబుల్స్ నరేష్‌కుమార్, యూసుఫ్ వెల్లడించారు. బుధవారం దర్గాఖలీజ్‌ఖాన్‌లోని న్యూ లిటిల్ స్కాలర్ స్కూల్‌లో విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సిటిట్యూట్ వాహనంలో విద్యార్థులకు నియమ నిబంధనలను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నర్సింహ రెడ్డి, ప్రిన్సిపల్ సూర్యకళారెడ్డి పాల్గొన్నారు.