రంగారెడ్డి

డెంగ్యూ కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 17: వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగానే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు ఎక్కువగా విజృంభిస్తున్నాయని షాద్‌నగర్ హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ జె.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ఎక్కువగా విజృంభిస్తున్నాయని వివరించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 29 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని, వ్యాధి సోకిన వారందరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అయతే సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రోగుల వివరాలు చెప్పడంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తొంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, జ్వర బాధితులు ఎక్కువగా ఉన్నప్పటికి వారి వివరాలను వెల్లడించకుండా గోప్యంగా పెడుతున్నట్లు సమాచారం.
పక్కాగా ప్రణాళికల అమలు
కొత్తూరు, సెప్టెంబర్ 17: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళికలను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజా సూచించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరుతోపాటు కోడిచర్ల, సిద్ధాపూర్, పెంజర్ల, ఎస్‌బీపల్లి గ్రామాల్లో అధికారుల బృందం సభ్యులు పర్యటించారు. డీపీఓ పద్మజా మాట్లాడుతూ ఇళ్ల మద్యలో ఉన్న పురాతన ఇళ్లను తొలగించడమే కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కొత్తూరు ఎంపీడీఓ జ్యోతి, ఈఓపీఆర్‌డీ శ్రీనివాస్, గ్రామస్తులు ఎమ్మె సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.