రంగారెడ్డి

జాతీయ గీతాలు..వెల్లివిరిసిన దేశభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం రామంతాపూర్‌లో తిరంగ యాత్ర ర్యాలీ రెపరెపలాడింది. ప్రధాన రహదారిలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. టీవీ స్టేషన్ నుంచి పెద్ద చెరువు వరకు నిర్వహించిన ర్యాలీలో దేశ భక్తి గీతాలు అలరించగా ప్రతి ఒక్కరిలో ఆనందం వెల్లివిరిసింది. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తిండేరు హన్మంతా రావు, బీజేపీ నేతలు కే.హరీష్, బండి పద్మ, రేవు నర్సింహ, గణేష్ గుప్త, రవీందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గోపాల్ రెడ్డి, ప్రదీప్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకుడు పారేపల్లి గణేష్ గుప్త ఆధ్వర్యంలో రామంతాపూర్ ప్రధాన రహదారిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.బీజేపీ బోడుప్పల్ నగర పాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో జాతీయ జెండాను ఎగరవేసి సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ను స్మరించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి మహేష్, నాయకులు ఏనుగు లక్ష్మయ్య, వెంకటేశ్, సిల్వేరు శంకర్, జైకిషన్, బాల సుబ్రమణ్యం, ప్రదీప్, కిరణ్, గురునాధరావు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ.మోహన్ రెడ్డి, బోడుప్పల్ కమిటీ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దాసరి మహేష్, ఇతర నాయకులతో కలిసి అనాథ పిల్లలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. పీర్జాదిగూడ నగర పాలక సంస్థ బీజెపీ అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి, కాచవానిసింగారం గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రభంజన్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో గీతా, రాణి, సుజాత, కరుణాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, శివ శంకర్, రాంచద్రం, భిక్షపతి పాల్గొన్నారు.