రంగారెడ్డి

పర్యావరణాన్ని కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి, ఆగస్టు 17: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజునాయక్ పేర్కొన్నారు. శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ అవరణలో శనివారం గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డితో కలిసి వారు మొక్కుల నాటారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంట్‌రాంరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంటయ్య, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, నాయకులు శ్రీధర్, వాసుదేవ్, రాంరెడ్డి, అశోక్‌కుమార్, చేర్ల నర్సింహ, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
నేడు గణేష్ మండప నిర్వాహకుల సదస్సు
ఉప్పల్, ఆగస్టు 17: ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక రామస్వామి ఫంక్షన్ హాల్‌లో గణేష్ మండప నిర్వాహకుల సదస్సు జరుగుతుందని అధ్యక్షుడు అన్య బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, సినీ హీరో సుమన్, ఏసీపీ గోనె సందీప్, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, గాయకురాలు మధుప్రియ, ఉత్సవ సమితి వ్యవస్థాప అధ్యక్షుడు ఆకుల మహేందర్ పాల్గొంటారని పేర్కొన్నారు. గణేష్ మండప నిర్వాహకులు హాజరై విజయవంతం చేయాలని చెప్పారు.
జడ్పీ చెర్మన్ శరత్ చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
ఉప్పల్, ఆగస్టు 17: మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు టీఆర్‌ఎస్ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్ కాచవానిసింగారం సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ వెంకట్ రాంరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు జక్క వెంకట్ రెడ్డి, రాసాల వెంకటేశ్ యాదవ్, పులకండ్ల జంగా రెడ్డి, నత్తి మైసయ్య, పప్పుల అంజి రెడ్డి, మాడ్గుల చంద్రా రెడ్డి, శేరి సవితా కరుణాకర్ రెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, రాజ రాజు, వీకే నాదం గౌడ్, కౌడే పోచయ్య, ఐలేష్ యాదవ్, సంతోష్ వందలాది మంది కార్యకర్తలు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం
ఉప్పల్, ఆగస్టు 17: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శనివారం యాదగిరి గుట్టకు వెళ్లిన సందర్భంగా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని మేడిపల్లిలో టీఆర్‌ఎస్ నాయకుడు జక్క వెంకట్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య వెళ్లిన కేసీఆర్ వెళ్తున్న బస్సును ఆపకపోయినప్పటికీ బస్సులో నుంచి అభివాదం చేసి పార్టీ శ్రేణుల మనస్సును దోచుకున్నారు. సీఎం దృష్టిని ఆకర్శించేందుకు ప్రధాన రహదారిలోని డివైడర్ల మధ్య కేసీఆర్ చిత్ర పటాలను ఏర్పాటు చేశారు. అనుమతి లేదని మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు.