రంగారెడ్డి

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, ఆగస్టు 17: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. శనివారం షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని లక్ష్మీనర్సింహా కాలనీకి చెందిన శ్రీరాం వెంకటేష్‌కు సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన రూ.60వేల చెక్కును టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ అందజేశారు. ఎంఎస్ నటరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ చెక్కులు వచ్చాయని వివరించారు. సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక సహాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన వి.నర్సింలు అనే వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.15వేల 500ల చెక్కును బాధితుడికి ఎంపీపీ ఎల్గనమోని రవీందర్ యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఈట గణేష్, ఫరూఖ్‌నగర్ జడ్పీటీసీ పి.వెంకట్‌రెడ్డి, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల పాల్గొన్నారు.
బోడుప్పల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా శంకర్
ఉప్పల్, ఆగస్టు 17: బోడుప్పల్ నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఎన్.శంకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడ పని చేస్తున్న కమిషనర్ ఆర్.ఉపేందర్ రెడ్డి జీహెచ్‌ఎంసీలోకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ప్రమోషన్ కోసం వేచియున్నారు. ఇతని స్థానంలో మనికొండలో పని చేస్తున్న స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ శంకర్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకు పని చేసిన ఉపేందర్ రెడ్డి తన పదవీ కాలంలో అభివృద్ధిలో బోడుప్పల్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్ది ప్రజల ప్రశంసలు అందుకున్నారు.
పీర్జాదిగూడ కమిషనర్ వాణీ రెడ్డి బదిలీ
ఉప్పల్, ఆగస్టు 17: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఇటీవలనే బాధ్యతలు స్వీకరించిన వాణీ రెడ్డి బదిలీ అయ్యారు. ఇటీవలనే కోరుట్ల నుంచి వచ్చి పని చేసిన కొద్ది కాలంలోనే ప్రజలకు దగ్గరైంది. ఉత్సాహంగా పని చేస్తూ అభివృద్ధి వైపు నగర పాలక సంస్థను తీసికెళ్తున్నప్పటికీ ఆమె ఆకస్మిక బదిలీ నిరుత్సాహానికి గురిచేసింది. వాణీ రెడ్డిని జీహెచ్‌ఎంసీకి బదిలీ చేయగా, స్థానంలో నగరంలోని చార్మినార్ డివిజన్‌లో పని చేస్తున్న స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగ థాయారును ఇక్కడికి బదీలీ చేసినట్లు సమాచారం.
జోరుగా హరితహారం
మేడ్చల్, ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని శనివారం మేడ్చల్ మునిసిపల్ పరిధిలో నిర్వహించారు. అత్వెల్లి పరిధిలో నిర్వహించిన హరితహారంలో కమిషనర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. కమిషనర్ మాట్లాడుతూ హరితహారంలో పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి పాల్గొన్నారు.