రంగారెడ్డి

ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 20: ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మారిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డినగర్ డివిజన్ ఆదర్శనగర్ కమిటీ హాల్‌లో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్ ఆధ్వర్యంలో పలు పార్టీల కార్యకర్తలు, యువకులు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బండారు దత్తాత్రేయ వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. దత్తాత్రేయ విలేఖరులతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో అన్నీ సమస్యలేనని, చిన్నపాటి వర్షాలకే కాలనీలు, బస్తీలు నీట మునిగే పరిస్థితి నెలకొందని, అస్తవ్యస్థంగా డ్రైనేజీ, శానిటేషన్ వ్యవస్థ మారిందని ద్వజమెత్తారు. పెద్దఎత్తున ముక్కుపిండి ప్రజల వద్ద పన్నులను వసూలు చేసే ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాంతారావు, నాయకులు రాజాగౌడ్, రంగా శ్రీనివాస్ గౌడ్, భరత సింహారెడ్డి, విమల్ తివారి, వేణు, ఆషా పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత
కొత్తూరు, జూలై 20: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం కొత్తూరు మండలం మల్లాపూర్‌తో పాటు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీకాలనీ, రెడ్డిపాలెంలో ఎస్‌డీఎఫ్ నిధులతో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీవైస్ చైర్మన్ ఈట గణేష్, కొత్తూరు ఎంపీపీ పిన్నింటి మధుసూధన్‌రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక శివశంకర్‌గౌడ్ పాల్గొన్నారు.

గుండ్లకుంటకు గండి

* 10ఎకరాల్లో పంట నష్టం * కొట్టుకుపోయిన పత్తి, కంది మొలకలు
షాద్‌నగర్, జూలై 20: భారీ వర్షానికి గుండ్లకుంటకు గండి పడటమే కాకుండా దిగువ ప్రాంతంలో ఉన్న పత్తి, కంది, మొక్కజొన్న మొలకలు కొట్టుకుపోయాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ముట్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గుండ్లకుంట చెరువుకు గండిపడింది. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా పెరగడం వలనగుండ్లకుంటకు గండి పడటంతో వర్షపునీరు పూర్తిగా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోయింది. దాంతో దిగువ ప్రాంతంలో ఉన్న పత్తి, మొక్కజొన్న, కంది పంటలు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా మొలకలు సైతం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఏడతెరిపి లేకుండా రాత్రి సమయంలో ఎక్కువగా వర్షం రావడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు రైతులు అంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు లేక, వచ్చిన కొద్దిపాటి వర్షానికి పంటలను సాగుచేసుకుంటే అకాల వర్షం కారణంగా ఉన్న పంటలు కాస్తా దెబ్బతిన్నాయని, దాంతో ఏమి చేయాలో తెలియడం లేదని రైతులు అంటున్నారు. గుండ్లకుంట చెరువులకు మరమ్మత్తులు చేయాలని, మిషన్ కాకతీయలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు అనేక మార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు ఖర్చు చేసి విత్తనాలు తీసుకువచ్చి పంటలను సాగుచేస్తే తీరా ఆకాల వర్షంతో ఉన్న కొద్దిపాటి మొలకులు సైతం కొట్టుకుపోయాయని రైతులు పేర్కొంటున్నారు. చెరువు కింద ఉన్న సుమారు పది ఎకరాల భూమిలో పంటలు నష్టపోయాయని, మండల అధికారులు సర్వే చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. గండిపడిన గుండ్లకుంటకు సత్వరమే మరమ్మతులు చేసి వర్షపునీరు నిల్వ ఉండే విధంగా కృషి చేయాలని, అప్పుడే సాగునీటికి ఇబ్బందులు తప్పుతాయని అన్నదాతలు అంటున్నారు. లేనిపక్షంలో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తొందని పేర్కొంటున్నారు.