రంగారెడ్డి

కలెక్టరేట్‌లో కరెంట్ కట్‌కట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 20: నిరంతరాయ కరెంటు సరఫరా అంటూ గొప్పలు చెప్పే ప్రభుత్వం కోతలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చీటికీ మాటికి విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరెంటు కష్టాలు ప్రజలకే కాదు..అధికారులకు సైతం తప్పడం లేదు. వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో సైతం కరెంటు కోతలతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కంప్యూటర్ లేనిదే పని జరుగని పరిస్థితి ఉండటంతో ఉన్నతాధికారులు కలెక్టర్ సమీక్షలకు వెళ్లేప్పుడు సంబంధిత సమాచారాన్ని కింది స్థాయి సిబ్బంది ద్వారా ప్రింట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు ఏ సమాచారం అడిగిన కింది స్థాయి సిబ్బంది కంప్యూటర్‌లో నమోదు చేసిన సమాచార వివరాలను ఉన్నతాధికారులకు ప్రింట్ తీసి ఇస్తుంటారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పవర్ కట్ చీటికీ మాటికి విధించడంతో కంప్యూటర్‌లో నిక్షిప్తమైన సమాచార వివరాలు ప్రింట్ తీసేందుకు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఉన్నతాధికారులు అడిగిన సమాచారం వెంటనే ఇవ్వకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో చీవాట్లు పడాల్సి వచ్చింది. కరెంటు అంతరాయం జరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా కరెంటు జనరేటర్, ఇన్వైటర్లు సక్రమంగా లేకపోవడంతో క్రింది స్థాయి సిబ్బంది తల పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంధించి కలెక్టరేట్‌లో పని వేళల్లో కరెంటు కోతలు విధించకుండా ఉండాలని, తప్పని సరి పరిస్థితుల్లో కరెంటు లేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిరంతరాయ కరెంటు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.