రంగారెడ్డి

ముగిసిన గుట్ట ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 19: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన శాకంబరీ ఉత్సవాలు శుక్రవారం తో ముగిసాయి. వేద పండితులు శ్రీ్భవానీ శివదుర్గ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, శాకంబరి అలంకార పూజ, శ్రీలలిత సహస్రనామార్చన, అష్టోత్తర శత కలశ స్ధాపన, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకుం, సహస్ర ఘటాభిషేకం, రుద్రహోమం, పూర్ణాహుతి, మహదాశీర్వచనం వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ టీ నారాయణ శర్మ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మీ నర్సింహమూర్తి, వంశ పారంపర్య ధర్మకర్తలు రమేశ్ శర్మ, ఉమాపతి శర్మ, వెంకటేశ్ శర్మ, శ్రీనివాస్ శర్మ, పండితులు రవి శర్మ, బలరాం శర్మ పాల్గొన్నారు.
అటవీ, రెవెన్యూ, పట్టా భూముల సమస్యను పరిష్కరించాలి
వికారాబాద్, జూలై 19: జిల్లాలో రెవెన్యూ, అటవీ, పట్టా భూముల సమస్యలను ఇరుశాఖల అధికారుల సహకారంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అయిశ మస్రత్ ఖానమ్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్‌లో అటవీశాఖ, రెవెన్యూ తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 41848 ఎకరాల్లో వికారాబాద్, తాండూరు, ధారూరు, కోడంగల్ ప్రాంతాల్లో అటవీ రెవెన్యూ భూ సమస్యలు ఉన్నాయని తెలిపారు. సర్వేయర్లు భూముల సర్వే చేసే ముందు వారికి అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 59 దరఖాస్తులు వచ్చాయని, సంబంధిత తహశీల్దార్లకు పంపించామని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ అరుణకుమారి, డీఆర్‌ఓ మోతీలాల్, డీఎఫ్‌ఓ వేణుమాధవ రావు, వికారాబాద్, తాండూరు ఆర్డీఓలు విశ్వనాథం, వేణుమాధవ్, ఏడీ (సర్వే ల్యాండ్ రికార్డ్స్) రాంరెడ్డి, డీటీడీఓ కోటాజీ ఉన్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు
కొత్తూరు రూరల్, జూలై 19: ప్రభుత్వ భూమి ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేసేవారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్‌ఎండీఏ సర్వేయర్ రవి వర్మ వివరించారు. శుక్రవారం కొత్తూరు మండల కేంద్రం బైపాస్ రహదారి పక్కన ఉన్న భూమిని పరిశీలించారు. రవి వర్మ మాట్లాడుతూ కొత్తూరు బైపాస్ రహదారి పక్కన సర్వే 28లో మొత్తం ఏడు ఏకరాల 30గుంటల భూమి ఉందని, అందులో వెంచర్ ఏర్పాటు చేసేందుకు భూ యజమాని రంగారావు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. సాధారణ అనుమతి ఇచ్చామని, పాటుకాలువలు ధ్వంసం చేశారని, కొంత ప్రభుత్వ భూమిని అక్రమించుకున్నారనే విషయంపై గ్రామస్థులు కొందరు హెచ్‌ఎండీఏకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అందులో భాగంగా వచ్చి పరిశీలించినట్లు వివరించారు. సమగ్ర విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.సర్వే 28లో పట్ట్భామి మాత్రమే ఉందని, ప్రభుత్వ భూమి బైపాస్ రహదారి విస్తరణలో పోయిందని భూ యజమాని రంగారావు తెలిపారు. పట్ట్భామిలో ఎలాంటి పాటుకాలువలు లేవని, వెంచర్ ఏర్పాటు కోసం అనుమతి ఇవ్వాలని హెచ్‌ఎండీఏలో దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.