రంగారెడ్డి

ప్రైమరీ పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 25: మండలంలోని రావల్‌కోల్ అనుబంధ గ్రామమైన షహజాదిగూడలోని ప్రైమరీ పాఠశాలలో ప్రతి రోజు రాత్రి సమయంలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని వెంటనే వాటిని నియంత్రించాలని కోరుతూ గ్రామ కార్యదర్శికి మంగళవారం గ్రామస్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రాత్రి సమయంలో పాఠశాలలో బీర్లు, సిగరెట్లు తాగడం, సీసాలను పగులగొడుతుండటంతో ఉదయం పాఠశాలకు విచ్చేసే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేని కారణంగా పాఠశాల వద్ద అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వినతిపత్రంలో కోరారు.
బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
తలకొండపల్లి, జూన్ 25: తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన బాలరాజు అనే బాధితునికి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలిఫ్‌ఫండ్ కింద మంజూరైన రూ.46500 చెక్కును మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సోమవారం తన నివాసంలో అందజేశారు. నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి పేదవాడికి ఏ ప్రమాదం, ఆపద వచ్చిన ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పేదవారు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి తర్వాత సహాయం అందిస్తుందని గుర్తుచేశారు. కార్యక్రమంలో తలకొండపల్లి జడ్పీపీటీసీ ఉప్పల వెంకటేష్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, రాజవర్ధన్ రెడ్డి, శ్రీను, సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు.

మూగజీవాలను కాపాడాలి
కొత్తూరు రూరల్, జూన్ 25: మూగజీవాలను సీజన్ రోగాలు, వివిధ రకాల వ్యాధుల బారి నుంచి కాపాడటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు వెటర్నరీ ఏడీ రషీద్ అన్నారు. మంగళవారం కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామంలో 1990గొర్రెలు, 298మేకలకు నట్టలనివారణ టీకాలు, మందులను పంపిణీ చేశారు. నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
ఏడీ రషీద్ మాట్లాడుతూ ప్రతి మూగజీవానికి నట్టల నివారణ మందులను తప్పనిసరిగా వేయించాలని సూచించారు. వర్షాకాలంలో మూగజీవాలకు వచ్చే సీజన్ రోగాలు, అంటు వ్యాధుల నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ స్ఫూర్తి, సర్పంచ్ రమాదేవి, ఉపసర్పంచ్ హేమలత, రమేష్, గోపాల్‌రెడ్డి, గొర్రెకాపరుల సంఘం అధ్యక్షుడు మెందె కృష్ణయ్య, సిబ్బంది మల్లయ్య, కృష్ణ, జయంతి, రవి, నర్సింహా పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు
* తహశీల్దార్ గౌతమ్‌కుమార్
జీడిమెట్ల, జూన్ 25: ప్రభుత్వ స్థలాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవని కుత్బుల్లాపూర్ మండల తహశీల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరించారు. గాజులరామారం డివిజన్ కైసర్‌నగర్, దేవెందర్ నగర్‌లలోని సర్వేనంబరు 342, 342/1, 329/1 79, 307లలోని ప్రభుత్వ స్థలాలను వీడియోగ్రాఫీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం కబ్జాకు గురైన వివరాలు, భవిష్యత్తులో ఎలాంటి కబ్జాలు కాకుండా చర్యలు తీసుకునేందుకు తహశీల్దార్ దగ్గరుండి వీడియోను తీయించారు. గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు ఇక ముందు ఎలాంటి కబ్జాలు జరిగినా, నిర్మాణాలు చేసినా తక్షణమే కూల్చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను అమ్మినా, కొన్నా కఠిన చర్యలేనని హెచ్చరించారు.