రంగారెడ్డి

అకాల వర్షం.. అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, ఏప్రిల్ 19: భారీ ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. యాచారం మండల పరిధిలోని మాల్, నల్లవెల్లి, ధర్మన్నగూడ, కొత్తపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ధర్మన్నగూడ గ్రామంలో వరి, మామిడి, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పంట నీటమునిగి గింజలు రాలిపోగా, చేతికివచ్చిన మామిడి కాయలు పూర్తిగా రాలిపోయాయి. ఉన్న కొద్దిపాటి పొలాల్లో వేసిన కూరగాయల పంటలు కూడా వడగండ్ల వర్షంతో తీరని నష్టాన్ని చేకూర్చిందని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు శుక్రవారం వారు ధర్మన్నగూడలో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. వడగండ్ల వర్షానికి గ్రామానికి చెందిన పుప్పాల నరసింహకు చెందిన పాడిగేదె మృతిచెందింది. బాధితున్ని ఆదుకోవాలని సీపీఎం నాయకులు, గ్రామ సర్పంచ్ బాషయ్య, ఉప సర్పంచ్ పాండు, జంగయ్య, నర్సింహ ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్లో భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా నగరంలో ఎండలు ప్రతాపాన్ని చూపడంతో శుక్రవారం కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. రాజేంద్రనగర్‌లో వడగళ్లతో కురిసిన వర్షంతో ప్రజలు ఆనందించారు. నెల రోజులుగా ఉగ్రరూపం చూపిన ఎండలు ఒక్కసారిగా తగ్గి వర్షం కురియడంతో సంతోషం వ్యక్తం చేశారు.
మేడ్చల్: మేడ్చల్‌లో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. జోరు గాలులతో వడగళ్ల వాన కురిసింది. కొద్ది సేపు మాత్రమే కురిసిన వాన తన ప్రభావాన్ని చూపింది. వడగళ్ల వాన ధాటికి వరి, ద్రాక్ష, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. రోడ్లు పొంగిపోర్లాయి. ఉక్కబోతతో ఉక్కిబిక్కిరవుతున్నా పట్టణ వాసులకు సాయంత్రం కురిసినా వర్షంతో వాతావరణం కాస్త చల్లబడి ఉపశమనం లభించింది.
చల్లబడ్డ నగరం
ఖైరతాబాద్: భానుడి ప్రచండ రూపంతో గరం, గరంగా ఉంటున్న నగరం గురువారం అర్థరాత్రి కురిసిన వర్షంతో చల్లబడింది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు సూర్యకిరణాలు నగరాన్ని తాకలేదు. అనంతరం తిరిగి తన ప్రతాపాన్ని ప్రదర్శించినా మధ్యాహ్నం కల్లా మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణంలో మార్పు వచ్చింది. సాయంత్రం 4 గంటలకు చల్లటి గాలులతో నగరంలో అహ్లాదకర వాతావరణం ఏర్పడింది. తిరిగి సాయంత్రం 6 గంటలకు నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురింది. సుమారు 20 నిమిషాల పాటు కురిసిన వర్షంతో ఆయా ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయంగా మారాయి. పంజాగుట్ట ప్రధాన రహదారిపై స్వల్పంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గుడ్‌ఫ్రైడే, హనుమాన్ జయంతి సందర్భంగా సెలవురోజు కావడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో ట్రాఫిక్ చిక్కులు తక్కువగా కనిపించాయి. కాగా గురువారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులతో వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో ఆయా ప్రాంతాల్లో కొద్ది సమయం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్‌ను పునరుద్ధరించారు.

భక్తిశ్రద్ధలతో స్వామివారి రథోత్సవం
షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 19: భక్తిశ్రద్ధలతో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఫరూఖ్‌నగర్-జానంపేట శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి పురవీధుల గుండా ఉత్సవమూర్తులతో స్వామి వారి రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రథోత్సవాన్ని నర్సింలు ప్రారంభించారు. అడుగడుగునా భక్తులు స్వామివారికి మంగళహారతులు ఇస్తూ ఊరేగింపు రథోత్సవాన్ని ముందుకు సాగించారు. స్వామివారి రథోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి నామాలను స్మరిస్తూ రథాన్ని ముందుకు సాగించారు. టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్, బచ్చలి నర్సింలు, చింటు, అన్మారి వెంకటయ్య, వంకాయల నారాయణరెడ్డి, అందె బాబయ్య, దొడ్డి రంగయ్య, ఆకుల మల్లేష్ పాల్గొన్నారు.