రంగారెడ్డి

కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఏప్రిల్ 18: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ కమిటీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగం శివశంకర్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు డీ.సుదర్శన్ బాబు మాట్లాడుతూ పంజాగుట్టలో కూల్చివేసిన చౌరస్తాలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్‌ను గౌరవించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగం శివశంకర్ మాట్లాడుతూ రోజురోజుకూ దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని, నేటికీ దళితులను అవమానిస్తున్నారని అన్నారు. బాబు జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.కార్యక్రమంలో నాయకులు దాసరి యాదగిరి, బాలాజి గైక్వాడ్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల అశోక్, జీడీ నర్సింహా, ఇరిగే రమేష్, సర్నకంటి విజయ్, రవి, సంఘం మహేష్, ముత్యాలు, నల్ల వెంకట్, ప్రణయ్, రమేష్ పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
కేశంపేట, ఏప్రిల్ 18: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కేశంపేట ఇన్‌చార్జ్జి ఎంపీడీఓ రాజేందర్‌సింగ్ అన్నారు. గురువారం కేశంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేందర్‌సింగ్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎలాంటి అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విధుల పట్ల ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండరాదని, ఒకవేళ ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈఓఆర్‌డీ మనోహర్, ఎంఈఓ మనోహర్‌లతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.