రంగారెడ్డి

రైతాంగ సమస్యల పరిష్కారానికి సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 18: క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలకి స్వల్ప సమయంలో పరిష్కారాలు, సూచనలు అందించే యంత్రాంగాన్ని రూపొందించేందుకు శాస్తవ్రేత్తలు, వ్యవసాయం, అనుబంధ శాఖలు సమాయత్తం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్ రావు సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వంగడాల రూపకల్పన, పరిశోధనలు జరుగాలని అన్నారు. విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ రోజు జరిగిన ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతో కూడిన దక్షిణ మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జిల్లాలకు చెందిన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్తవ్రేత్తలు, రైతులు, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. రైతులకు పరిశోధనా ఫలాలు చేరువయినప్పుడే ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధశాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టే ఖర్చు సద్వినియోగం అయినట్లని ఆయన అన్నారు. రైతులకు అవసరమైన వంగడాలు, టెక్నాలజీలు, యంత్రాలు, వినియోగదారులకు సరైన పోషకాహారం అందించినప్పుడే అందరూ సక్రమంగా పని చేసినట్లని ప్రవీణ్ రావు వివరించారు. వ్యవసాయ రంగం ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో ఉందని, సరైన మార్గం చూపవలసిన బాధ్యత మనందరిపైన ఉందని స్పష్టం చేశారు. మొక్కుబడి పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలు కాకుండా వ్యవసాయరంగం, రైతాంగం ప్రాంతాలవారీగా ఎదుర్కొంటున్న కీలకాంశాలు ఏమిటో గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు వెదకాలని సూచించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలు, వ్యవసాయ విద్యాలయం సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని అన్నారు. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడంతో పాటు వాతావరణ మార్పులకు తట్టుకొని, సాగు లాభసాటిగా మారే విధంగా పరిశోధనలు, టెక్నాలజీలు ఉండాలని పేర్కొన్నారు. సివిల్స్ ఫిలితాల్లో ర్యాంకు సాధించిన మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి మాతృమూర్తి మిర్యాలగూడ ఏడీఏ నాగమణిని ఉపకులపతి సభికుల హర్షధ్వానాల మధ్య సత్కరించారు.