రంగారెడ్డి

రైతుల సంక్షేమే దేశానికి శ్రీరామ రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి ఫిబ్రవరి 21: రాష్ట్ర ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారికి పెద్ద పీఠ వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం శంకర్‌పల్లి మండల టీఆర్‌స్ అధ్యక్షుడు, గుడిమల్కపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డీ.వెంకట్ రెడ్డి, డైరెక్టర్ శేరి అనంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని మంత్రి ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామరక్ష అని అన్నారు. రైతును రాజును చేయాలన్న సంల్పంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.

కొవ్వత్తుల ర్యాలీ
కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 21: కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ గురువారం కూకట్‌పల్లి ఆకాంక్ష వెల్ఫేర్ సోసైటి ప్రతినిధులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాట్లాడుతూ భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడిని వారు తీవ్రంగా ఖండించారు. భారత సైనికుల త్యాగాలను దేశ ప్రజలు మరవలేనివని అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆకాంక్ష వెల్ఫేర్ సోసైటీ సభ్యులు సీహెచ్‌వీ రామారావు, యాకయ్య, ప్రభాకర్, శ్యామ్, వేణు, జగన్, సుధాకర్, శ్యామల, గీత పాల్గొన్నారు.

మంత్రివర్గంలో మహిళలకు
చోటు కల్పించకపోవడం దారుణం
యాచారం, ఫిబ్రవరి 21: రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించకపోవడం దారుణమని వికలాంగుల హక్కుల పోరాట సమితీ జిల్లా అధ్యక్షులు కాళ్లజంగయ్య ప్రభుత్వం పై మండిపడ్డారు. గురువారం మండల కేంద్రంలోని వికలాంగుల భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి వారికి మంత్రివర్గంలో ప్రాథాన్యత కల్పించకపోవడం మహిళలపట్ల ప్రభుత్వ తీరుకు నిదర్శనం అన్నారు. వార్డు మెంబర్ల స్థాయి నుంచి జడ్పీ చైర్మన్ వరకు రాజకీయ రిజర్వేషన్లు ఉంటే, మంత్రి వర్గంలో ప్రాథాన్యత ఎందుకు కల్పించరని ప్రశ్నించారు. సమావేశంలో వీహెచ్‌పీఎస్ మండల మహిళా విభాగం కార్యదర్శి గౌసియా, కోశాధికారి లక్ష్మి, ఉపాధ్యక్షురాలు అంజమ్మ, కళమ్మ, వీహెచ్‌పీఎస్ నాయకులు జంగయ్య, మల్కాపురం శివశంకర్ పాల్గొన్నారు.
అస్వస్థతకు గురైన నెమలి..
అటవీశాఖ అధికారులకు అప్పగింత
వికారాబాద్, ఫిబ్రవరి 21: అస్వస్థతకు గురైన నెమలిని అటవీశాఖ అధికారులకు అప్పగించిన సంఘటన నవాబుపేట పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి గురువారం ఉదయం సమయంలో మండల కేంద్రం నుంచి స్వగ్రామినికి వెళ్తుండగా, ఓ వ్యవసాయ పొలంలో నెమలి అస్వస్థతకు గురై నేలపై పడి ఉంది. తిరుపతిరెడ్డి ఫోన్లో స్థానిక పోలీసులకు సమాచారం అందించి నెమలికి ప్రాథమిక చికిత్స చేసి ఊపిరి పోశాడు. విషయమై తిరుపతిరెడ్డిని అటవీశాఖ అధికారులు అభినందించారు.

మాతృ భాష దినోత్సవం
కులకచర్ల, ఫిబ్రవరి 21; అమ్మ భాష దినోత్సవాన్ని కులకచర్ల మండలం గోప్యానాయక్ తండాలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పిల్లలకు తెలుగుపై మమకారం పెంచుకోవాలని సూచించారు. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి తెలుగు బాషపై పట్టును పెంచుకునే ప్రయత్నాలు నిర్వహించారు.