రంగారెడ్డి

మేడ్చల్‌లో 16 నుంచి 10కి తగ్గిన ఎంపీటీసీల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ మండల పరిషత్ అధికారులు గురువారం మండల ఎంపీటీసీల జాబితాను వెల్లడించారు. మేడ్చల్, అత్వెల్లి, గిర్మాపూర్, కండ్లకోయ, గుండ్లపోచంపల్లి వంటి గ్రామాలు మేడ్చల్, గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీల్లో వీలినం కావడం, యాడారం, మురాహరిపల్లి గ్రామాలు శామీర్‌పేట్ మండలంలో వీలినం కావడంతో ఇప్పటి వరకు ఉన్న 16 మంది ఎంపీటీసీల సంఖ్య కాస్త 10కి కుదించుకుపోయింది. 10 ఎంపీటీసీలకు చెందిన జాబితాను గ్రామాల్లో గురువారం అధికారులు ప్రదర్శించారు. అధికారులు వెల్లడించిన జాబితా అనుసారం 1 శ్రీరంగవరం, 2 గౌడవెళ్లి, 3, డబిల్‌పూర్ 1, 4 డబిల్‌పూర్ 2, 5 నూతన్‌కల్ (నూతన్‌కల్, కోణాయిపల్లి, మైసిరెడ్డిపల్లి గ్రామాలు కలిపి), 6 ఏల్లంపేట్ (ఏల్లంపేట్, సోమారం, సైదోనిగడ్డ తండా కలిపి), 7 పూడూరు (పూడూరు, మునీరాబాద్ కలిపి), 8 రాజబొల్లారం (రాజబొల్లారం, రాజబొల్లారం తండా పంచాయతీలు కలిపి), 9 రాయిలాపూర్ (రాయిలాపూర్, బండమాదారం గ్రామాలు కలిపి), 10 రావల్‌కోల్ పది ఎంపీటీసీ నియోజకవర్గాలుగా గుర్తించి జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గురువారం అధికారులు ప్రదర్శించారు.
నూతన సర్పంచ్‌లకు ఐదు రోజుల శిక్షణ
కులకచర్ల, ఫిబ్రవరి 21; నూతనంగా ఎన్నికైన సర్పంచిలకు ఈనెల 23 నుంచి 5 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కులకచర్ల ఈ ఓపీ ఆర్‌డీ సురేష్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని టీఎస్ క్యాబ్ ప్రాంగాణంలో ఐసీటీ కాంప్లెక్స్‌లో ఈ శిక్షణ ఉంటుందని అన్నారు. మండలం నుంచి ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌లు అందరు వినియోగించుకోవాలని కోరారు. 5రోజుల పాటు వారు అక్కడే ఉండేందుకు ఆవాసం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామాభివృద్దిలో సర్పంచ్‌ల పాత్ర ఎలా ఉండాలనే విషయంపై శిక్షణ ఉంటుందని అన్నారు. ఉపన్యాసాలు, డిజిటల్ పాఠాల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మండలానికి చెందిన 44 మంది సర్పంచ్‌లు విధిగా 5 రోజుల పాటు హాజరు కావాలని సూచించారు. ఈ మేరకు వారందరికి సమాచారం అందించామన్నారు.
నాలా విస్తరణ పనులు వేగవంతం
* శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21: నాలా విస్తరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి వర్షాకాలంలోపు పూర్తి చేయాలని అధికారులకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. గురువారం చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ వద్ద నిర్మిస్తున్న నాలా విస్తరణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నాలా నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి సిటీ ప్లానర్ ఆర్.శ్రీనివాస రావు, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్, సైట్ ఇంజనీర్ రూప హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు ఉప్పలపాటి శ్రీకాంత్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఎం.ప్రసాద్, వెంకట్ ఉన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో నీటి సరఫరా
కీసర, ఫిబ్రవరి 21: నీటి ఎద్దడి తీర్చాలని నాగారం గ్రామస్తులు పలుమార్లు పాలక వర్గానికి విన్నవించినా, రోడ్డుపై ధర్నా చేసినా స్పందించక పోవటంతో కాలనీ అసోసియేషన్ నాయకులు జేఏసీగా ఏర్పాటై ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నాగారం గ్రామంలో 108 కాలనీలు ఉన్నాయి. ఎండకాలం మొదలు కాకముందే నీటి ఎద్దడి మొదలైంది. పలు రకాలుగా ప్రజలు నిరసనలు తెలిపారు. నాగారం గ్రామం రింగ్‌రోడ్డుకు లోపల ఉండటంతో జలమండలి నీటి సరఫరా చేస్తోంది. తగినన్ని నీళ్లు సరఫరా చేయక పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.