రంగారెడ్డి

గుండె రంధ్రానికి అరుదైన చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 12: చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచి గుండెకు రంధ్రం ఉంటే ఎలాంటి సర్జరీ లేకుండా చికిత్సను అందిస్తున్నట్లు ఎల్బీనగర్ కామినేని వైద్యులు రవికాంత్, సాగర్ వెల్లడించారు. కామినేనిలో అరుదైన చికిత్సను ఓ బాలుడికి చేశారు. మంగళవారం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, చిన్న పిల్లలకు పుట్టుకతో వచ్చిన రోగాలను ముందుగా గుర్తించి చికిత్సను అందిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని అన్నారు. చిన్న పిల్లలకు గుండెలో రంధ్రం ఉన్నట్లు తెలిస్తే గతంలో మాదిరిగా ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటివి చేయకుండా చికిత్సను చేసి వారిని ఆ ప్రమాదం నుంచి కాపాడతామని చెప్పారు. తల్లిదండ్రుల వయస్సు ఎక్కువ ఉండటంతో పాటు వారికి ఇతర రోగాలు ఉన్పప్పుడే పుట్టిన పిల్లలకు ఇలాంటి రోగాలు వస్తాయని చెప్పారు. గుండె రంధ్రానికి సంబంధించి రెండు లక్షల ఖర్చుతో చికిత్స చేయవచ్చని గుర్తు చేశారు. కామినేని ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ, ఇతర హెల్త్ కార్డుల సౌకర్యం ఉన్న వారికి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.