జాతీయ వార్తలు

గుండుగొలను రోడ్డుకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రూక్‌ఫీల్డ్ ఇండియాకు కాంట్రాక్ట్
వైదొలగిన గమాన్
త్వరలో పనులకు శ్రీకారం
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇతోధికంగా ఉపయోగపడే విజయవాడ-గుండుగొలను రహదారి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు దక్కించుకున్న గమాన్ సంస్థకు నిధుల కొరత ఏర్పడటంతో పని పూర్తి చేయటం తమవల్లకాదని చేతులెత్తేసింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రంగంలోకి దిగి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న విధాన నిర్ణయం మేరకు గమాన్ స్థానంలో బ్రూక్ ఫీల్డ్ ఇండియాకు రహదారి నిర్మాణాన్ని అప్పగించాలని నిర్ణయించింది. బ్రూక్ ఫీల్డ్ సంస్థ వంద మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించుకుని రహదారి నిర్మాణాన్ని చేపడుతుందని అధికార ప్రకటనలో తెలియచేశారు. ఈ రహదారి నిర్మాణానికి 1648 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.