రుచి

పుచ్చగింజలతో పసందైన వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసివి కాలంలో విరివిగా లభించే పుచ్చకాయతోనే కాదు పుచ్చగింజలతో కూడా పసందైన వంటలు చేసుకోవచ్చు. గుజ్జును తింటాం గింజలను వృథాగా పడేస్తుంటాం. ఒక్కొక్క కాయలో
గింజలు కూడా బాగానే ఉంటాయ. దేశీవాలీ కాయలో ఎక్కువ గింజలు లభిస్తాయ. వీటిని వృథాగా పారేయ్యకుండా కాయనుంచి
విడదీసి ఎండబెట్టి అమ్ముతారు.
మార్కెట్‌లో కేజీల లెక్కన దొరుకుతాయి.
వీటితో లడ్డులు, చిక్కిలు, హల్వా,
పొడి చేయడమే కాక గోధుమ
హల్వాలలో కూడా దీన్ని రుచికి
వాడతారు. ప్రోటీనులు, విటమిన్లు వున్నవి కనుక తరచు స్వీట్స్‌లో వాడతారు.

చిక్కి

గుమ్మడి గింజలు-అరకేజీ, ఎండుకొబ్బరి-కప్పు,
నువ్వులు-1 కప్పు,
ఏలకులు-12, బెల్లం-1/4 కేజీ, నెయ్యి-1 కప్పు
విధానం: ముందుగా బాణలిలో నెయ్యివేసి పప్పులు వేసి దోరగా వేయించాలి. బెల్లం ముక్కలు వేసి నీరు ఒక కప్పు పోసి పాకం రానిచ్చి దానిలో పప్పులు, కొబ్బరి, పప్పు పోసి కలిపి యాలకులు పొడి చేర్చి కలిపి పళ్లెంలోలో నెయ్యిరాసి అచ్చుగాపోయాలి. ఆరాక నచ్చిన ఆకృతిలో ముక్కలుగా చేసుకోవాలి.

వడ

గింజలు-1/4 కేజీ, పచ్చిమిర్చి-6, శనగపప్పు-1 కప్పు,
ఉల్లిముక్కలు-2 కప్పులు,
అల్లం కోరు-5 చెంచాలు, నూనె-250గ్రాములు, కారన్ ఫ్లోర్-2 చెంచాలు
విధానం: ముందుగా గింజలు నానపెట్టి, శనగపప్పు నానపెట్టి అన్నీ ముద్దగా మిక్సీపట్టాలి. పచ్చి మిర్చి, అల్లం కార్న్‌ఫ్లోర్ అన్నీ చేర్చి ముద్దగా చేసుకోవాలి. నూనె వేగనిచ్చి పై పిండి వడలుగా తట్టి నూనెలో వేయించాలి. ఇలా మొత్తం పిండి అంతా వడలుగా తట్టి వేయించుకోవాలి.

గోధుమ హల్వా

పుచ్చగింజలు-1/4 కేజీ, గోధుమలు-2 కప్పులు,
బెల్లం-2 కప్పులు, యాలకులు-5, నెయ్యి-2 కప్పులు,
కొబ్బరి పాలు-1 కప్పు
విధానం: ముందుగా గోధుమలు నీటిలో నానబెట్టి పొట్టు తీసి మిక్సీపట్టి పాలుగా చేసుకుని అందులో కొబ్బరి పాలు పోసి వుంచాలి. బాణలిలో నెయ్యి వేసి వేగనిచ్చి ఈ పాలు పోసి కలుపుతూ దగ్గర పడనివ్వాలి. దీనిలో బెల్లం చేర్చి దగ్గర పడుతుండగా వేయించిన పుచ్చగింజ చేర్చి, మిగతానెయ్యి చేర్చి కలియబెట్టి పళ్లానికి నెయ్యిరాసి దళసరిగా సర్దాలి. ఇది చల్లారాక ప్రిజ్‌లో పెడితే గట్టిపడి ముక్కలుగా వస్తుంది.

సేమ్యా ఖీర్

హైదరాబాద్ సన్న సేమ్యా-2 కప్పులు, పుచ్చ గింజలు-5 కప్పులు, పాలు-1 లీటరు, కొబ్బరి పాలు-1 కప్పు, బాదం పౌడర్-5 చెంచాలు, నెయ్యి-1/2 కప్పు, యాలకులు-12, జీడిపప్పులు-24, కిస్‌మిస్-24, ఫ్రూటీ క్రూటీ ముక్కలు-1/2 కప్పు, పంచదార-1 కప్పు
విధానం: ముందుగా నేతిలో పప్పులు, సేమ్యా అన్నీ వేయించుకోవాలి. ఈ గింజలు మిక్సీపట్టి పాలు చేర్చి ముద్దగా మిక్సీపట్టాలి. పాలు కాగనిచ్చి ఈ ముద్దవేసి బాగా కలపాలి. ఇది పొంగులు వస్తుండగా సేమ్యా చేర్చి కొబ్బరి పాలు, బాదంపౌడర్ అన్నీ చేర్చి మరగనివ్వాలి. మిగిలిన నెయ్యి, యాలకులు, జీడిపప్పులు,ఫ్రూటీ క్రూటీ ముక్కలు అన్నీ చేర్చి కలపాలి. బాగా మరిగాక దింపి కప్పులో వడ్డించాలి. చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టుకుని తిన్నా మంచి రుచిగా వుంటుంది.

లడ్డు

పుచ్చ గింజలు-1/4 కేజీ, బెల్లం-1/4 కేజీ, జీడిపప్పులు-24, బాదంపప్పులు-24, నెయ్యి-5 చెంచాలు, యాలకులు-12
విధానం: ముందుగా పుచ్చగింజలు నేతిలో దోరగా వేయించి, జీడిపప్పు, బాదంపప్పు వేయించి మిక్సీ రవ్వ మాదిరిగా పట్టలి. బెల్లానికి కప్పునీరు చేర్చి పాకం రానిచ్చి యాలకుల పొడి, ఈ రవ్వ, మిగిలిన నెయ్యివేసి దింపాలి. దీన్ని వేడిమీద లడ్డులా చేసుకోవాలి.

ఇడ్లీ, దోశల పొడి

పుచ్చగింజలు-1/2 కేజీ, కరివేప-4, నూనె-5 చెంచాలు, ఉప్పు-4 చెంచాలు, ధనియాలు-1/2 కప్పు, ఎండుమిర్చి-24, పుట్నలపప్పు-1/2 కప్పు, జీలకర్ర-1/2కప్పు.
విధానం: బాణలిలో నూనె పోసి జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అన్నీ దోరగా వేయించాలి. చివరగా గుమ్మడి గింజలు వేయించి దింపాలి. చల్లారాక అన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఈ పొడి కమ్మగా రుచిగా వుంటుంది. ఇడ్లీ, దోశ దేనికైనా మంచి రుచి!

-వాణి ప్రభాకరి