రివ్యూ

నిజంగానే.. పిట్ట కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** ఓ పిట్ట కథ
**
తారాగణం: విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫర్: సునీల్‌కుమార్ ఎన్
ఎడిటర్: డి.వెంకట ప్రభు
నిర్మాతలు: ఆనంద్ ప్రసాద్
దర్శకత్వం: చెందు ముద్దు
**
ఎదుటి వ్యక్తిని బుట్టలో వేయడానికో, ఇంప్రెస్ చేయడానికో చెప్పే -బరువులేని పిల్ల కథే -పిట్ట కథ. పల్లెటూళ్లలో పరిపాటిగా ఉపయోగించే నానుడి కూడా. దానే్న -ఓ పిట్ట కథ అంటూ క్యాచీ టైటిల్ చేసుకున్నాడు చెందు ముద్దు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీలను ప్రధాన పాత్రలు చేశాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా థియేటర్లకొచ్చింది.
ఓ పిట్ట కథ చెప్పడానికి -పెద్ద ప్రమోషనే్స ప్రయోగించారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావ్ తెరంగేట్రం చేస్తున్న సినిమా కనుక -తనకున్న ఇండస్ట్రీ పరిచయాలను బలంగానే ఉపయోగించాడు. విడుదలకు ముందు ఎన్ని కథలు చెప్పినా -చూపించే కథలో సత్తా లేకుంటే మాత్రం ప్రేక్షకుడు తిప్పికొడతాడన్న విషయం అనేక సినిమాలతో రుజువైంది. మరి -ఈ పిట్ట కథను ప్రేక్షకుడు ఎంతవరకూ రిసీవ్ చేసుకున్నాడో రివ్యూలో చూద్దాం.
తల్లిలేని పిల్ల వెంకటలక్ష్మి (నిత్యశెట్టి). తండ్రి పెంపకంలో గారాబంగా పెరుగుతుంది. వెంకటలక్ష్మిని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తుంటాడు -అతని దగ్గర పనిచేసే ప్రభు (సంజయ్‌రావు). వెంకటలక్ష్మి ప్రేమలో పడే సమయానికి -ఆమె జీవితంలోకి చైనా నుంచి దిగుతాడు క్రిష్ (విశ్వంత్ దుద్దుంపూడి). తొలి చూపులోనే పల్లె అందం మాయలో పడిన క్రిష్ -తన లవ్ సక్సెస్ కావాలంటే ఆమెకు ప్రభుని దూరం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈక్రమంలో వెంకటలక్ష్మి మిస్సవుతుంది. మిస్సింగ్ కేసు విచారణకు యస్‌ఐ బ్రహ్మాజీ -సీన్‌లోకొస్తాడు. వెంకటలక్ష్మిని క్రిష్ అంతమొందించిన వీడియో ఒకటి పోలీస్ ఇనె్వస్టిగేషన్‌లో బయటికొస్తుంది. కేసు ముగిసింది అనుకునే టైంలో -ఆమెను ప్రభు అంతమొందించాడన్న మరో సాక్ష్యం దొరుకుతుంది. వెంకటలక్ష్మి మిస్సింగ్ మిస్టరీని కొలిక్కితెచ్చే ఆసక్తికరమైన కథాభాగాన్ని -స్క్రీన్‌పైనే చూడాలి.
గాళ్ మిస్సింగ్ కేసుకు సస్పెన్స్ థ్రిల్లర్‌ని ఆపాదించి చేసిన సినిమాలు తెలుగుకు కొత్తకాదు. కాకపోతే, కథను సీరియస్‌గా చెబుతున్నారా? సింపుల్‌గా చెబుతున్నారా? అన్న దానిపైనే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడా అదే జరిగింది. నిజానికి -ఇదొక పిట్ట కథే. దానే్న బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు చెందు. సింపుల్ లైన్‌కు బలమైన క్లైమాక్స్ దొరకటంతో -రెండగంటల కథల్లాడు. కాకపోతే -్ఫస్ట్ఫాకి బ్యాలెన్సింగ్ ట్రీట్‌మెంట్ ఇవ్వడంలో విఫలమయ్యాడు. లవ్‌ట్రాక్‌కు సంబంధించిన సన్నివేశాలు సైతం కనెక్టింగ్‌గా లేకపోవడంతో -ఆడియన్స్ భారంగానే కూర్చోక తప్పదు. కథలోకి ఇన్వాల్వ్ చేయలేని బలహీన సన్నివేశాలు, ప్రతిభను చూపించాలనుకునే లోతైన సంభాషణలు -కథతో మిళితం కాకపోవడంతో బలవంతపు వంటకమన్న భావనే కలిగించింది. వెంకటలక్ష్మి మిస్సింగ్.. ఆ మిస్టరీలో హీరోలు ఇరుక్కున్న విధానం.. ఫ్లాష్‌బ్యాక్ రివీల్ చేస్తూ అనుమానాలు తలెత్తేలా కథను నడిపించిన తీరు.. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకెండాఫ్ ట్విస్ట్‌లు ఇవే సినిమాను బతికించే అంశాలు.
విశ్వంత్ దుద్దంపూడి పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాహ్యముఖం, అంతర్ముఖాన్ని చూపించాల్సిన సందర్భాల్లో మంచి నటన కనబర్చాడు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావ్ పాత్రలో వేరియేషన్స్ చూపించే అవకాశం తక్కువే అయినా -నిత్యశెట్టితో లవ్‌ట్రాక్ ఫెయిర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిత్యశెట్టి పాత్రకు తగిన ఆహార్యంతో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులంతా పరిధిమేరకు నటించారు.
టెక్నికల్‌గా ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్, సునీల్‌కుమార్ సినిమాటోగ్రఫీ -ఓ పిట్ట కథకు ప్లస్‌పాయింట్స్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ఫైనల్‌గా -సస్పెన్స్ ఎలిమెంట్స్‌ని గ్రిప్పింగ్‌గా చెప్పడంలో దర్శకుడు చెందు అనుభవరాహిత్యం కనిపించింది. ఆసక్తికరమైన 30 నిమిషాల క్లైమాక్స్ కంటెంట్ కోసం -గంటన్నర సినిమాను భరించాల్సి రావడం ఆడియన్స్ ఓపికపై ఆధారపడి ఉంటుంది.

-ప్రవవి