రివ్యూ

పంట పండినట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** భీష్మ
**
తారాగణం: నితిన్, రష్మిక మండన్న, అనంత్‌నాగ్, జిషు సేన్ గుప్తా, వెనె్నల కిషోర్, సుదర్శన్, సంపత్, నరేష్, రఘుబాబు, బ్రహ్మాజీ, సుదర్శన్ తదితరులు
సంగీతం: మహతి స్వరసాగర్
ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్
దర్శకత్వం: వెంకీ కుడుముల
**
కెరీర్ గ్రాఫ్ జీరోకి వచ్చేస్తోన్న టైంలో -హీరో నితిన్ రెండు సాహసాలు చేశాడు. ఒకటి -మూడు ఫ్లాప్‌ల తరువాత ఏడాదిన్నర గ్యాప్‌తో ‘ భీష్మ’ ప్రాజెక్టు చేయడం. రెండోది -మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని ఇంకా అనిపించుకోకుండా.. (ప్రాజెక్టు విడుదలకు ముందు) పెళ్లిని ప్రకటించటం. నిజానికి -రెంటినీ ముడిపెట్టి చూడకూడదు. కాకపోతే, మొదటి సాహసం సక్సెస్ అయితే -రెండో సాహసం కాస్తా అద్భుత ‘సహవాసం’ అయ్యే ఇంపాక్ట్‌నిస్తుంది. సక్సెస్ నుంచి ఎక్స్‌ట్రీం సక్సెస్‌కు జర్నీ చేస్తోన్న మూడ్‌ని క్రియేట్ చేస్తుంది.
తోటి హీరోలతో వెనుకపడుతున్నానని నితిన్ కంగారు పడలేదు. కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లడానికి స్టార్ డైరెక్టర్లను వెతుక్కోలేదు. భీభత్సమైన యాక్షన్ కథను అస్సలు ఎత్తుకోలేదు. యుద్ధం చేయాలంటే క్షేత్రంలో ఉండాలి. ఆడియన్స్ సంతృప్తిపడాలంటే ఎంటర్‌టైన్‌మెంటే చూపించాలి. అదే -నితిన్ చేశాడు. ‘ భీష్మ’ అయ్యింది.
నిజానికి దర్శకుడు వెంకీ కుడుముల అనుభవం -రెండక్షరాల ఛలో ఒక్కటే. దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్న చిన్న ధైర్యం. ఆ గట్స్‌తో చేసిన మళ్లీ రెండక్షరాల సినిమా -్భష్మ. ఈ సినిమా -నితిన్‌కు ఎక్స్‌ట్రీమ్ సక్సెస్‌వైపు జర్నీ చేసే మూడ్‌నిచ్చిందా? దర్శకుడు వెంకీకి -తనదైన శైలి ఒకటుందని ఇండస్ట్రీకి నమ్మకం కలిగించిందా.. చూద్దాం.
కథ:
భీష్మ (నితిన్) -ఓ మంచి బేవార్స్. సార్థక నామధేయుడు కాకుండా -తనకూ గాళ్ ఫ్రెండ్ ఉండాలనుకుంటాడు. సెట్ చేసుకునే ప్రయత్నంలో -చైత్ర (రష్మిక మండన్న) తారసపడుతుంది. సేంద్రీయ సాగుని ప్రమోట్ చేసే భీష్మ ఆర్గానిక్స్‌లో ఉన్నతోద్యోగిగా పరిచయమవుతుంది. బేవార్స్ ట్రిక్కులు ప్రయోగించి ఆమెను ఇంప్రెస్ చేస్తాడు. చైత్ర పనిచేస్తున్న సంస్థ అధినేత అనంత్ నాగ్. కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య భీష్మను తన సంస్థకు సీఈవో చేస్తాడు. అనంత్ నాగ్ అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి తలెత్తాన కారణాలు? చైత్రకు బాసైపోయిన భీష్మ -ఆ సంస్థను ఎలా నడిపాడు. ప్రత్యర్థుల కుట్రను ఎలా భగ్నం చేశాడన్నది మిగతా కథ.
నిజానికిదో పాచిపట్టిన కథ. ఈ ఫార్మాట్ కథలు తెలుగులో కోకొల్లలు. ఒకప్పటి సినిమాల్లో -పులిపిరి పెట్టుకున్న ఎన్టీఆర్‌నో, విగ్గుపెట్టుకున్న చిరంజీవినో పక్కపాత్రలు గుర్తించలేని సీన్స్ పడుతుంటే.. అరె అనుకునే వాళ్లం. లాజిక్‌కు అందని అలాంటి సీన్స్ ‘్భష్మ’లోనూ లెక్కలేనన్ని ఉన్నాయి. వేల కోట్ల విలువైన సంస్థకు హీరో సీఈవో అయిపోవడం, ఉన్నతోద్యోగంలో ఉన్న చదువుకున్న హీరోయిన్ ఒక ఫైట్ చేశాడని గాలికి తిరిగే కుర్రాడికి పడిపోవడంలాంటి వాటిని ప్రస్తావించాలి. ఫార్మాట్ దాటని పాత కథను ఎర్రర్ టెంప్లెంట్స్ మీదకెక్కించినా -ఇక్కడ ‘అరె’ అనుకోలేం. అందుక్కారణం -ఎంటర్‌టైన్‌మెంట్ అనే మ్యాజిక్‌ను అద్భుతంగా ప్రయోగించాడు దర్శకుడు వెంకీ. పూర్తిగా నమ్మి ఫాలో అయిపోయాడు నితిన్. సరదాగా సన్నివేశాలు.. ప్లజెంట్ ఫీలింగ్‌నిచ్చే పాత్రలు.. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్.. పుసుక్కున నవ్వించే సంభాషణలు.. కంటికింపైన విజువల్స్.. బడ్జెట్‌కు వెరవని ప్రొడక్షన్ వాల్యూస్.. -వెరసి భీష్మ గట్టెక్కేశాడు. సింపుల్ కథను కన్వీనియెంట్‌గా చూపిస్తూ -వేర్ ద డ్రామా స్టార్ట్స్ దేరీజ్ నో లాజిక్’ అనిపించేశాడు. దర్శకుడు త్రివిక్రమ్ శిష్యుడిగా అతని శైలిని ప్రతి ఫ్రేమ్‌లో చూపిస్తూనే -అందులోనే తనదైన శైలి ఉందని చెప్పడానికి ‘ట్రెండీ వైన్‌లైనర్స్’ను సమర్థంగా ప్రయోగించాడు. అందుకు నితిన్‌తోపాటు వెనె్నల కిషోర్ -దర్శకుడు వెంకీ కుడుములకు బలాన్నిచ్చారు. బ్రహ్మచారి బతుకులోని పాట్లును పాటగా చెప్పుకున్న హీరో సీన్ తరువాత వచ్చే ‘సెల్ఫీ’ సీన్ ఒక్కటి చాలు -దర్శకుడి వెంకీ తనదైన శైలి చూపించాడని చెప్పడానికి. ఎన్టీఆర్, ఏయన్నార్ కాలంనాటి హీరోయిజాన్ని, చిరంజీవి శకంలో కంటిన్యూ అయిన హీరోయిజాన్ని -నితిన్‌లాంటి హీరోకి అప్లై చేసిన విధానం సరదాగా అనిపిస్తుంది. చైత్రను టీజ్ చేసిన రౌడీ బ్యాచ్‌ను ఉతికేయడం, ఆడిటోరియంలో విలన్‌కు కౌంటర్లేసి గాలి తీసేయటం, అలాంటి హీరోయిజానికి ఇంప్రెస్ అయిపోయిన హీరయిన్ ప్రేమలో పడటంలాంటి సీన్లన్నీ అలాంటివే. చూసేసిన సీనే్ల అన్న ఆలోచనే ఆడియన్స్ మైండ్‌లోకి రాకుండా -దర్శకుడు చేసిన ‘మైండ్ మ్యాజిక్’ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది. సీరియస్ ఇష్యూని సింపుల్‌గా చెప్పడమే త్రివిక్రమ్ స్టయిల్ -శిష్యుడు వెంకీ కథలో అణువణువునా కనిపించింది. సెకెండాఫ్‌లో సీరియస్ ఇష్యూ సేంద్రీయ సాగు చుట్టూనే కథ తిరిగినా.. ఎంటర్‌టైనె్మంట్ ఫ్యాక్టర్‌తో ఈజీగా దాటేశాడు దర్శకుడు. నితిన్‌లోని అచ్చమైన హీరోయిజాన్ని చూపిస్తే పాత్ర సమతుల్యతే దెబ్బతింటుంది కనుక -విలన్ పాత్రకూ లైట్ డోస్ పెట్టడం పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌గా చూడొచ్చు.
నితిన్ -్భష్మ పాత్రను సులువుగా చేసేశాడు. ఎంజాయ్‌బుల్ క్యారెక్టర్ పడితే ఎంతగా చేసేయొచ్చో అంతా నితిన్ చేసేశాడు. భీష్మ పాత్రకు నితిన్ ఫిట్. హీరోయిన్ రష్మిక మండన్నకూ మంచి పెయిర్ దొరికింది. నిజానికి -రష్మికకే నితిన్ పర్ఫెక్ట్ ఫిట్ అనిపించింది. విలన్ పాత్రధారి జిషు సేన్ గుప్తా, కీలక పాత్రలో అనంత్ నాగ్ -పాత్రలను గంభీరంగా, సులువుగా చేసేశారు. సినిమాకు వెనె్నల కిషోర్ కామెడీ టైమింగ్ ప్రాణం. అతన్ని దర్శకుడు వెంకీ సమర్థంగా ప్రయోగించాడు. తనకు హిట్టునిచ్చిన ఛలో టెక్నికల్ టీంనే భీష్మకు కంటిన్యూ చేశాడు వెంకీ. కాకపోతే, మహతి ఆడియో అస్సెట్టూ కాలేదు, అప్సెట్టూ చేయలేదు. జస్ట్ ఓకే. సింగిల్ యాంథమ్ బావుంది. సాయిశ్రీరామ్ ఎక్స్‌లెంట్ విజువల్స్‌తో తన స్టామినా మరోసారి చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఓవరాల్‌గా - భీష్మ ఓకే. బట్ నాట్ డబుల్ ఓకే.

-ప్రవవి